Chiranjeevi:మెగా బ్రదర్స్‌పై రోజా కామెంట్స్..మంత్రిగా మా ఇంటికి భోజనానికి, ఇప్పుడేమో ఇలా : గట్టిగా ఇచ్చిపడేసిన చిరంజీవి

  • IndiaGlitz, [Thursday,January 12 2023]

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలినీ టార్గెట్ చేయడం కలకలం రేపింది. ఎప్పుడూ పవన్‌ కళ్యాణ్‌పై మాత్రమే విరుచుకుపడే రోజా నేరుగా మెగా బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించడం వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌లను ముగ్గురిని సొంత జిల్లా ప్రజలే ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్ధమవుతోందన్నారు. సినీనటులు అందరికీ సాయం చేస్తారని.. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా వున్నారంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కల్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడంటూ ఆమె తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ... తొక్కిసలాటలో చనిపోయిన వారికి పవన్ ఇవ్వడం లేదని రోజా ఎద్దేవా చేశారు.

మీది నోరా .. మున్సిపాలిటీ కుప్ప తొట్టా : నాగబాబు

అయితే రోజా వ్యాఖ్యలకు మెగా బ్రదర్స్ హర్ట్ అయ్యారు. ఒకప్పుడు జబర్దస్త్ షోలో తన క్లోజ్ ఫ్రెండ్‌లా వున్న నాగబాబు సైతం రోజాపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇన్నాళ్లు మీరు ఏం మాట్లాడినా స్పందించకపోవడానికి కారణం వుంది. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్దగా తేడా లేదంటూ కౌంటరిచ్చారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, అభివృద్ధి చేయడమన్న సంగతిని ముందు తెలుసుకోవాలని నాగబాబు చురకలంటించారు. దేశవ్యాప్తంగా పర్యాటకం విషయంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో వుందని ఆయన దుయ్యబట్టారు.

నా సాయం తీసుకుని ఇప్పుడు ఏం చేయలేదంటున్నారు :చిరంజీవి

ఇక ఎవరు తనపై విమర్శలు చేసినా సైలెంట్‌గా వుండే చిరంజీవి సైతం రోజా వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన.. మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె మాటలపై తాను ఏం మాట్లాడదలచుకోలేదని, రోజా గతంలో తనతో కలిసి పలు చిత్రాల్లో నటించారని గుర్తుచేశారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో పాటు కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సాయం ఇవన్నీ తన సహాయం చేసే గుణానికి నిదర్శనమని చిరు చురకలంటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రోజా తన ఇంటికి వచ్చి, భోజనం కూడా చేశారని.. సొంత మనిషిలానే తిరిగారని మెగాస్టార్ అన్నారు. తనతో స్నేహంగా వుండి తన సాయం తీసుకున్నవాళ్లు ఇప్పుడు సాయం తీసుకోలేదని చెబుతున్నారని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.

More News

Golden Globe Awards: అసలేంటీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఎప్పుడు పుట్టింది, ఎవరు, ఎందుకిస్తారు..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి

Aravana prasadam : అయ్యప్ప భక్తులకు షాక్.. శబరిమల ‘‘అరవణ’’ ప్రసాదం విక్రయాలు నిలిపివేత, కారణమిదే

భారతదేశంలోని మూల మూలలా ఎన్నో ప్రతిష్టాత్మక ఆలయాలున్నాయి. వాటికి తగ్గట్టుగా ఆహార కథలు కూడా వున్నాయి.

ATM: జీ 5 'ఏటీఎం' ట్రైల‌ర్‌.. ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ఏటీఎం’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది.

Kamalinee Mukherjee : ఆనంద్‌లో అలరించిన అందం..ఇప్పుడిలా, కమిలినీ ఇలా అయిపోయిందేంటీ..?

హీరోయిన్స్ ఫేడవుట్ అయిపోయిన తర్వాత వారిని మళ్లీ చూస్తే గుర్తుపట్టడం చాలా కష్టం వుంటోంది.

Shanti Kumari IAS : తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారి .. రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా చరిత్ర, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

సోమేశ్ కుమార్‌ ఏపీకి వెళ్లడంతో తెలంగాణ కొత్త సీఎస్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.