సింగిల్ ఫ్రేమ్‌లో మెగాస్టార్ డైరెక్టర్లు.. వైరల్ అవుతున్న పిక్..

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనంతరం ఒక సినిమా చేస్తూ వచ్చారు. తాజాగా మాత్రం స్పీడ్ అందుకున్నారు. వరుసగా సినిమాలకు ఓకే చెప్పేసి పలు సినిమాలకు లైన్‌లో ఉంచారు. వచ్చే ఏడాది మెగాస్టార్‌కి సంబంధించిన మూడు సినిమాలు ప్రారంభం కానున్నాయి. మెహర్ రమేష్, వి.వి. వినాయక్‌, బాబీలకు ఇప్పటికే మెగాస్టార్ ఓకే చెప్పేశారు. ఈ ముగ్గురూ వచ్చే ఏడాది చిరుని డైరెక్ట్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు డైరెక్టర్స్ కలిసి సెల్ఫీ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ వి.వి.వినాయక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు మెహర్ రమేష్, బాబీ కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా ఈ ముగ్గురు త్వరలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ఫోటోపై అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు.

మెహర్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో వినాయక్, బాబీలను ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు ఈ పిక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా.. వి.వి.వినాయక్ మెగాస్టార్‌తో ‘లూసిఫర్’ రీమేక్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. మెహర్ రమేష్.. ‘వేదాళం’ రీమేక్‌కు ప్లాన్ చేస్తున్నారు. బాబీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది మెగాస్టార్ అప్‌డేట్స్ భారీగానే వచ్చే అవకాశం ఉంది.

More News

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

బుట్టబొమ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున కూల్ కూల్‌గా వచ్చారు. కానీ ఒక్కొక్కరిపై కొరడా ఝుళిపించారు. పేరు పేరునా వాయించి వదిలిపెట్టారు.

'ఒరేయ్ బుజ్జిగా..'మూవీతో మా గోల్ రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది - యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన చిత్రం

ఆర్జీవీ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ దిశ సినిమాపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు

ఏపీ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్2లో ఇంజినీరింగ్ పరీక్షకు

ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

ఇప్పుడున్న కుర్ర హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొన్ని భావాల‌ను ఓపెన్‌గా చెప్ప‌డమే విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న అల‌వాటు.