close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్’కు మెగాస్టార్ సాయం..

Wednesday, November 25, 2020 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్’కు మెగాస్టార్ సాయం..

‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ సినిమాకు మెగాస్టార్ సాయమందించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలను తెలుగులో చిరంజీవి, హిందీలో ఆమిర్‌ ఖాన్‌ పరిచయం చేయనున్నారా? పరిచయం చేయబోతున్నారనే టాక్ బాగా వినబడుతోంది. ఇటీవల చెర్రీ, ఎన్టీఆర్ పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన టీజర్‌లకు ఈ స్టార్ హీరోలిద్దరూ ఒకరికొకరు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ టీజర్‌లకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మరింత హైప్ తీసుకురావాలనే యోచనతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో అగ్రహీరోలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇవి రెండు పవర్ ఫుల్ పాత్రలు కావడంతో ఆ పాత్రలకు స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరు, అమిర్‌లను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. కాగా.. వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు వీరిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

టాలీవుడ్, బాలీవుడ్‌లకు అగ్రహీరోలు ఓకే చెప్పేశారు. ఇక ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రూపొందుతోంది. మరి ఈ భాషల్లో ఎవరితో వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలనే దానిపై చిత్రబృందం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా భాషల్లో అగ్ర కథానాయకులతో చర్చలు సాగిస్తున్నారని సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్‌, రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz