‘ఉప్పెన’ టీమ్ కు  మెగా గిఫ్ట్‌.. ఖ‌రీదెంతో తెలుసా?

కరోనా టైమ్‌లో వ‌స్తున్న సినిమాల్లో ఒక్కొక్క వారం ఒక్కో సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగానే మెప్పిస్తూ వ‌స్తుంది. అయితే సంక్రాంతి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన చిత్రాల్లో క్రాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయితే ‘ఉప్పెన’ సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. బుచ్చిబాబు సానా అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని క్రియేట్ చేస్తోంది. వైష్ణ‌వ్‌తేజ్, కృతి శెట్టి, విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌ను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రేక్ష‌కులే కాదు.. నంద‌మూరి బాల‌కృష్ణ‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ వంటి స్టార్స్ కూడా ‘ఉప్పెన’ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌ను అభినందిస్తూ స్పెష‌ల్ గిఫ్ట్‌ను పంపాడు. అభినంద‌న‌ల‌తో పాటు సందేశంతో ఉన్న గిఫ్ట్‌ను చిరంజీవి యూనిట్ స‌భ్యుల‌కు పంపాడు. స‌ముద్ర‌పు ఒడ్డుపై మోకాళిపై నిల‌బ‌డిన యువ‌జంట హ‌త్తుకుని ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటున్నారు. స్పెయిన్‌కు చెందిన ప్ర‌ముఖ ల‌గ్జ‌రీ ఉత్ప‌త్తుల సంస్థ లాడ్రో ఈ ప్ర‌తిమ‌ను త‌యారు చేసింది. దీని విలువ అక్ష‌రాల రూ.89 వేలు. ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్‌ను అభినందించిన సంగ‌తి తెలిసిందే.

More News

ఒక్క ట్వీట్‌తో రూ.1.10 లక్షల కోట్లు కోల్పోయిన మస్క్

ఒకే ఒక్క ట్వీట్ కొంపముంచింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా పోయేలా చేసింది.  షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం.

స్మార్ట్ ఫోన్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందట..

కాదేదీ కరోనాకు అనర్హం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది..

అందుకే 'చెక్' సినిమా కోసం అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను - ప్రియా ప్రకాశ్ వారియర్

ప్రియా ప్రకాశ్ వారియర్... యువతరం ప్రేక్షకులు ఈ అమ్మాయిని మర్చిపోవడం అంత సులభం కాదు.

మార్చి 5న `పవర్ ప్లే'

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`.

ఎమ్మెల్యే రాపాకకు ఝలక్ ఇచ్చిన జనసైనికులు..

జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ పార్టీకే ఝలక్ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. దీనిని మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ జనసైనికులు