సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ గెస్ట్ గా చిరు...?

  • IndiaGlitz, [Thursday,December 19 2019]

సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగేందుకు రెఢీ అవుతున్నాయి. దాదాపు ఏడెనిమిది సినిమాలు బరిలో ఉన్నా... అసలు పోరు మాత్రం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమాల మధ్యే ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ రెండు సినిమాల చిత్ర యూనిట్ సైతం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ మొదలెట్టేశాయి. అయితే బన్నీ కి ఎలాగూ మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటుంది... దీంతో బన్నీ దే సంక్రాంతి బాక్సాఫీస్ బొనాంజా అనుకున్నారు. కానీ... దీనికి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది సరిలేరు నీకెవ్వరు టీమ్. ఇందుకోసం ప్రయత్నాలు మొదలెట్టేసింది కూడా. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మెగా హీరో అల్లు అర్జున్ తో పోటీ పడి నెగ్గాలంటే... మెగా హీరోల మద్దతు మస్ట్ అని డిసైడ్ అయింది.

అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రావాలని కోరింది. కానీ బిజీ షెడ్యూల్ వల్ల చెర్రీ కి కుదరక పోవడంతో కాస్త అప్ సెట్ అయింది. దీంతో జనవరి 5న ఎల్ బి స్టేడియం లో జరిగే ఈవెంట్ కు హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవిని కోరినట్లు సమాచారం. ఇదే నిజం అయితే... ఈ కార్యక్రమంలో చిరు పాల్గొంటే... మెగా అభిమానులు మహేష్ కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.

కాగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ... జనవరి 12న అల వైకుంఠ పురంలో సినిమాలు విడుదల కానున్నాయి. మరి సంక్రాంతి బరిలో నిలవడమే కాదు ...అసలైన స్టఫ్ తో అభిమానులని అలరించేదేవరో... సంక్రాంతి బరిలో గెలిచేదెవరో చూడాలి మరి. కాగా ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల నుంచి రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

More News

బాల‌య్య మాట నిల‌బెట్టుకుంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం `రూల‌ర్‌`. క్రిస్మ‌స్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌లవుతుంది.

వెంకీ మామ అదుర్స్ అన్న మెగాస్టార్... మామకు తగ్గ అల్లుడు చైతు అంటూ ప్రశంస

వెంకీ మామ... డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెంకటేష్,

హాస్యనటుడు అలీకి మాతృవియోగం

ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృవియోగం కలిగింది. అలీ తల్లి జైతన్ బీబీ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

గొల్లపూడి మారుతీరావుకు సినీ పరిశ్రమ ఘనంగా నివాళి

బాహుముఖ ప్రజ్ఞాశాలి, ఇటీవల మృతిచెందిన గొల్లపూడి మారుతీరావుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా నివాళి అర్పించింది.

‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌,