మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల 'డియర్ మేఘ' థియేటర్ రిలీజ్ కు రెడీ

  • IndiaGlitz, [Wednesday,August 18 2021]

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్రల్లో నటించారు. ''డియర్ మేఘ'' చిత్రాన్ని 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డెబ్యూ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా రెడీగా ఉన్నా, థియేటర్ రిలీజ్ కోసం టీమ్ మెంబర్స్ వెయిట్ చేశారు. థియేటర్ లలో విడుదలవుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ''డియర్ మేఘ'' కూడా సిల్వర్ స్క్రీన్ పైనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ప్యూర్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా ''డియర్ మేఘ'' సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది.. ''డియర్ మేఘ'' సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్ ను ఆడియెన్స్ కు కలిగిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. హరి గౌర కంపోజ్ చేసిన ''డియర్ మేఘ'' పాటలు హిట్ కాగా, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ పీఎస్ వర్మ, పీఆర్వో - జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

More News

'లవ్ స్టోరి' సెప్టెంబర్ 10న థియేటర్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి".

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' లో 'పంచమి' గా నిధి అగర్వాల్

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక.

'సకల గుణాభిరామ' ఫస్ట్ లుక్ లాంచ్

E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో

‘క్రేజీ అంకుల్స్‌’.. ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసే స‌ర‌దా పాత్ర‌లో మెప్పిస్తాను:  సింగ‌ర్ మ‌నో

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’.

ప్రముఖ సంగీత దర్శకులు తమన్ చేతులు మీదుగా మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని నటించిన 'అర్థం' ఫస్ట్‌లుక్ విడుదల

'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్...