close
Choose your channels

మెహ‌ర్ ఈజ్ బ్యాక్‌!

Monday, August 19, 2019 • తెలుగు Comments

మెహ‌ర్ ఈజ్ బ్యాక్‌!

తెలుగు తెర‌కు స్టైలింగ్ చేసి, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ లో క‌ల‌రింగ్ ఇచ్చిన డైర‌క్ట‌ర్ల‌ను గురించి ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిన‌ప్పుడు మెహ‌ర్ ర‌మేష్ పేరు త‌ప్ప‌క ఉంటుంది. మేకింగ్‌లో పెట్టే ధ్యాస‌ను స్టోరీలో పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల‌నో, మ‌రేమోగానీ, ఆయ‌న‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ, డైర‌క్ట‌ర్‌గా ఏస్ లిస్ట్ లో ఆయ‌న లేరు. గ‌త కొన్నాళ్లుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ చేత‌బ‌ట్ట‌డానికి ట్రై చేస్తున్నారు.

అయితే ఈ సారి ఆయ‌న ట్రై చేస్తున్న‌ది ఫిల్మ్ మేకింగ్ కాదు.. వెబ్ సీరీస్ మేకింగ్‌. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కోసం ఆయ‌న ఈ వెబ్‌సీరీస్ చేయ‌బోతున్నారు. ఈ వెబ్‌సీరీస్‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తార‌ని తెలుస్తోంది. పేరు మోసిన లాయ‌ర్ వుమ‌నైజ‌ర్ అయితే ప‌రిస్థితి ఏంటి? అంటూ డ‌బ్బు చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ వెబ్‌సీరీస్‌ను రూపొందిస్తున్న‌ట్టు వినికిడి. మ‌రో వైపు మ‌హేష్ కోసం ఆయ‌న స్క్రిప్ట్ సిద్ధం చేశార‌ని, మ‌హేష్ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏది ముందు జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz