మనందరిలో `అశ్వథ్థామ` ఉంటాడు - మెహరీన్‌

  • IndiaGlitz, [Monday,January 27 2020]

ఈ ఏడాది జనవరిలో ‘ఎంతమంచివాడవురా’, ‘పటాస్‌' చిత్రాలతో లో మన ముందుకు వచ్చిన మెహరీన్‌..జనవరి చివరి వారంలో ‘అశ్వథ్థామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రమణతేజ డైరెక్ట్‌ చేశారు. జనవరి 31న విడుదలకానున్న ఈ సినిమా గురించి మెహరీన్‌ మాట్లాడుతూ “అశ్వథ్థామ అంటే చెడుకి వ్యతిరేకంగా నిలిచేవాడు అని అర్థం. ఇందులో తన చెల్లెలకి జరిగిన బాధకరమైన ఘటనతో హీరో జర్నీ ప్రారంభం అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇదొక సీరియస్‌ సినిమా. ఒక్కోసారి మన క్యారెక్టర్‌ కోసం కాకుండా మంచి సినిమాలో పార్ట్‌ అవ్వడం కోసం చేస్తాను. ఈ సినిమా అలాంటిదే. మనందరిలో అశ్వథ్థామ ఉంటాడు. తనని మనం బయటకు తీసుకురావాలి. ఇక ఓ మహిళగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్‌ మీడియాలో పెద్దగా రియాక్ట్‌ అవ్వను. రియాక్ట్‌ అవ్వడం వల్ల సొల్యూషన్స్‌ వస్తాయని నేను అనుకోను. మార్పు అనేది మనలో రావాలి. నాగశౌర్య .. తన ఫ్రెండ్‌ సర్కిల్‌లో జరిగిన నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నారు. నాగశౌర్యకి ఉన్న లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఈ సినిమాతో మారబోతుంది” అన్నారు.

More News

ఫిబ్రవరి 7న వస్తున్న 'స్టాలిన్'

వైవిధ్యభరిత చిత్రాలనే కాదు మాస్ చిత్రాలను చేస్తూ ఆల్ రౌండ్ కధానాయకుడిగా జీవా  పేరుపొందారు.

వైఎస్ ఎంతో కష్టపడి తెస్తే.. జగన్ ఎందుకీ ఆలోచన!?

అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కష్టపడి తెచ్చిన ఓ భగీరథ ప్రయత్నాన్ని .. ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ‘అస్సలు అది వద్దంటే వద్దు’

'రైట్ రైట్ బగ్గిడి గోపాల్' బయోపిక్ ఫిబ్రవరి 28న విడుదల

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో

విక‌సించిన సినీ ప‌ద్మాలు

కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ ఏడాది ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ప‌ద్మ పుర‌స్కారాలు వ‌రించాయి.

కేబినెట్, అసెంబ్లీ సరే.. కేంద్రం సంగతేంటి జగన్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్న పని జరిగి తీరాల్సిందే అన్నంతగా పట్టుబడతారన్న విషయం తెలిసిందే.