వరుణ్ తేజ్ కి జోడీగా మెహరీన్

  • IndiaGlitz, [Thursday,January 04 2018]

కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ‌, మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది మెహ‌రీన్‌. ఆ త‌రువాత చేసిన కేరాఫ్ సూర్య‌, జ‌వాన్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. ఈ ముద్దుగుమ్మకి అవ‌కాశాల ప‌రంగా స‌మ‌స్య ఏమీ రాలేదు. ప్ర‌స్తుతం ఈ పంజాబీ భామ గోపీచంద్ 25వ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తూ బిజీగా ఉంది.

అలాగే మ‌రో ఆఫ‌ర్ కూడా ఈ అమ్మ‌డిని వ‌రించింద‌ని తెలిసింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్ 2 పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో వెంక‌టేష్ ఓ క‌థానాయ‌కుడు కాగా.. మ‌రో హీరోగా వ‌రుణ్ తేజ్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్ర‌కారం.. వ‌రుణ్ తేజ్‌కి జోడీగా మెహ‌రీన్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

More News

ఆడిషన్స్ కోసం కొత్త పద్ధతిని అవలంబిస్తున్న తేజ

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం‘ఎన్టీఆర్’.

'జై సింహా' ప్రీమియర్ షోకి ఎన్టీఆర్?

నందమూరి బాలకృష్ణ,నయనతార జంటగా ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

'సైరా నరసింహారెడ్డి'..స‌మ‌స్య అదేనా?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు.

ఆ ఇద్దరిలో ఎవరు?

నందమూరి వంశం నుంచి మరో హీరో తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

బాలీవుడ్ రీమేక్ లో అడివి శేష్...

చేతన్ భగత్ రాసిన నవల '2స్టేట్స్ ' నవల ఆధారంగా అదే టైటిల్ తో బాలీవుడ్లో సినిమా చేసిన సంగతి తెలిసిందే.