close
Choose your channels

'మేక సూరి 2' మూవీ రివ్యూ

Friday, November 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మేక సూరి 2 మూవీ రివ్యూ

కోవిడ్ పుణ్య‌మాని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజిన‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అలా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్స్‌లో ‘మేక‌సూరి’ ఒక‌టి. ఒక వ్య‌క్తికి అన్యాయం జ‌రిగి, చ‌ట్టాన్ని ఆశ్ర‌యించిన‌ప్పుడు న్యాయం దొర‌క్క‌పోతే అత‌నెలా మారుతాడు? అనే కాన్సెప్ట్‌తో రూపొందిన మేక సూరిలో రెండో భాగం విష‌యానికి వ‌స్తే...

క‌థ‌:

సూరి(అభిన‌య్‌).. సింగ‌రాయ‌కొండ‌లో ఉండే క‌సాయి. అత‌ని భార్య రాణి(సుమ‌య‌)ని అప్ప‌ల‌నాయుడు స‌హా మ‌రికొంత మంది క‌లిసి మాన‌భంగం చేసి హ‌త్య చేస్తారు. సూరి హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవడం కోసం న‌క్స‌లైట్స్‌తో క‌లుస్తాడు. ప్ర‌తీకార హ‌త్య‌ల‌ను ఆపే క్ర‌మంలో పోలీసులు సూరిని ఎన్‌కౌంట‌ర్ చేస్తారనే వ‌ర‌కు తొలిభాగంలో చూశాం. ఇక రెండో భాగం విష‌యానికి వ‌స్తే లైంగిక నేరాలు చేసేవారిని, వారిని స‌మ‌ర్ధించే వారిని సూరి చంపుతుంటాడు. అత‌న్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఏసీపీ(ప్ర‌మోద్‌)ని నియ‌మిస్తుంది. అత‌ను సూరిని ఎన్‌కౌంట‌ర్ చేసిన పోలీస్ అధికారుల‌ను విచారిస్తాడు. అందులో త‌న‌కి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అవేంటి?  చివ‌ర‌కు సూరి ఏమ‌య్యాడు?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘మేక‌సూరి 2’ చూడాల్సిందే...

విశ్లేషణ:

సమాజంలో మ‌హిళ‌లు లైంగిక దాడుల‌కు గుర‌వుతున్నారు. అలాంటి వారిని మేక‌సూరి అనే వ్య‌క్తి కాపాడితే ఎలా ఉంటుంది అనే ఓ ఆలోచ‌న‌తో దర్శ‌కుడు త్రినాథ్ వెలిశిల రూపొందించిన చిత్రమే మేక‌సూరి. ఇందులో మొద‌టి భాగంలో మేక‌సూరి నేప‌థ్యం గురించి చూపిస్తే.. రెండో భాగంలో త‌ను స‌మాజంలోని మాన‌వ మృగాల‌ను ఎలా వేటాడాడు?  దాన్ని అడ్డుకోవ‌డానికి పోలీస్ ఆఫీస‌ర్ ఏం చేశాడు? అనే విష‌యాల‌ను తెర‌కెక్కించాడు. స్టైలిష్‌గా కాకుండా.. రా నెరేష‌న్‌లో ఈ ఒరిజిన‌ల్ సాగింది. మొద‌టి భాగానికి కొన‌సాగింపుగా యాక్ష‌న్, ఛేజింగ్స్ అన్నీ రెండో పార్టులోనూ ఉన్నాయి. మొద‌టి భాగంలో సూరి పాత్ర‌ధారిని ఎలా ఎలివేట్ చేశాడో.. రెండో భాగంలోనూ అలాగే ఎలివేట్ చేశారు. కొన్ని స‌న్నివేశాలు చూసినప్పుడు ఇంత రానెస్ అవ‌స‌ర‌మా! అని కూడా అనిపిస్తుంది. మ‌రికొన్ని స‌న్నివేశాలు వాస్త‌విక‌త‌ను చాలా దూరంగా అనిపిస్తాయి. మేక సూరి ద‌ళంలో చేర‌డం, వారు అత‌నికి సాయం చేసే స‌న్నివేశాలు కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తాయి. సూరి.. పోలీసుల‌తో ఆడే మైండ్ గేమ్స్ చూసి ఇదేంట్రా బాబు అనిపిస్తాయి. డైలాగ్స్ రా స్టైల్లో ఉన్నాయి. కొన్ని స‌న్నివేశాల‌ను సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తాయి. న‌టీన‌టులు చాలా చ‌క్క‌గా న‌టించారు. వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.  ప్రజ్వాల్ క్రిష్ యొక్క నేపథ్య సంగీతం, పర్ధు సైనా యొక్క సినిమాటోగ్రఫీ మరియు ఇతర సాంకేతిక విభాగాలు నేప‌థ్యానికి త‌గిన‌ట్లుగా ఉన్నాయి.

చివ‌ర‌గా.. మేక‌సూరి.. రా నెరేష‌న్‌

రేటింగ్: 2.5/5

నటీనటులు : అభినయ్, సమయ, శ్రావణ్, నరేష్ బైరెడ్డి, ప్ర‌మోద్‌ తదితరులు

ఛాయాగ్రహణం: పార్ధు సైనా

సంగీతం:  ప్రజ్వల్‌ క్రిష్‌

నిర్మాత : కార్తీక్ కంచెర్ల

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : త్రినాధ్ వెలిశిల

Read 'Meka Suri 2' Review in English

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.