సూర్య మేము రిలీజ్ ఎప్పుడు...

  • IndiaGlitz, [Friday,December 25 2015]

సూర్య న‌టించి..నిర్మించిన తాజా చిత్రం ప‌సంగ 2. ఈ చిత్రాన్ని తెలుగులో మేము టైటిల్ తో అనువ‌దించారు. జూల‌కంటి మ‌ధుసూద‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.ఈ చిత్రంలో సూర్య‌, అమ‌లాపాల్, బింధు మాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డే చిన్నారుల చుట్టూ ఈ సినిమా క‌థ తిరుగుతుంది. జాతీయ అవార్డు గ్ర‌హీత పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మేము చిత్రాన్ని డిసెంబ‌ర్ మొద‌టివారంలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత డిసెంబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఇప్ప‌డు క్రిస్మెస్ కానుక‌గా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో మేము మ‌ళ్లీ వాయిదాప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం మేము చిత్రాన్ని జ‌న‌వ‌రి నెలాఖ‌రున రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..మంచి క‌థాంశంతో రూపొందిన మేము ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

More News

ఊపిరిలో మరో హీరోయిన్...

నాగార్జున,కార్తీ,తమన్నా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఊపిరి.ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు,తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

విదేశాలలో హల్ చల్ చేయనున్న లారెన్స్ 'కాంచన'

రాఘవ లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన 'కాంచన'చిత్రం చైనీస్,కొరియన్ మరియు థాయ్ భాషల్లో నిర్మాణానికి సిద్ధమవుతోంది.

జత కలిసే టీమ్ ను అభినందించిన పూరి జగన్నాథ్

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన చిత్రం ‘జతకలిసే’.‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.

నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి..ఆవిషయంలో పూర్తి నమ్మకం ఉంది - హీరోయిన్ రెజీనా

ఎస్.ఎం.ఎస్,రొటీన్ లవ్ స్టోరి,రారా క్రిష్ణయ్య,కొత్త జంట,పవర్,పిల్లా నువ్వులేని జీవితం...తదితర చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ రెజీనా.

డిసెంబర్ 27న 'నాన్నకు ప్రేమతో..' ఆడియో

యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.