మెంటల్ మదిలో సక్సెస్ సెలెబ్రేషన్స్

  • IndiaGlitz, [Friday,December 01 2017]

ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'మెంట‌ల్ మ‌దిలో'. రాజ్ కందుకూరి నిర్మాత‌. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. డి.సురేశ్‌బాబు స‌మర్పిస్తున్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంట‌గా నటించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుదలైన ఈ చిత్రం నేటికీ మంచి స్పందనతో పాటు కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఈ సందర్బంగా మెంటల్ మదిలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సెలెబ్రేషన్స్ ను చేసుకుంటూ షీల్డ్స్ ల ప్రధాన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం రామానాయుడు స్టూడియోలో జరుపుకుంది.

ఈ కార్య‌క్ర‌మంలో అతిథులుగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్, నందిని రెడ్డి, నిర్మాత దామోదర్ ప్రసాద్ లు పాల్గొని చిత్ర యూనిట్ కు షీల్డ్ లు ప్రదానం చేసారు.

అనంతరం మెంటల్ మదిలో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "నేను ప్రజల మన్ననలతో విజయాన్ని పోల్చుతాను, పెళ్లి చూపులు సినిమా తరువాత ఎక్కువ అప్ప్రీషియేట్స్ వస్తున్నాయి ఈ చిత్రానికి, ధర్మపథ బ్యానర్ నుంచి మరో పది మంది నూతన టెక్నీషియన్స్ టీం వచ్చినందుకు గర్వాంగా ఫీల్ అవుతున్నా.. అమెరికాలో థియేటర్లు కూడా పెంచారు, ఇక్కడ కలెక్షన్స్ కూడా రోజు రోజుకు పెరగడం సంతోషంగా ఉంది, కస్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ముఖ్యంగా ఈ చిత్రానికి పూర్తి సపోర్ట్ అందించిన నిర్మాత సురేష్ బాబు గారికి, శివాజీ రాజా గారికి, మధురా ఆడియో ద్వారా ఈ చిత్ర పాటలు విడుదల చేసిన మధుర శ్రీధర్ గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. నా హాపీనెస్ కు కారణం మాత్రం ఆడియన్స్ కనుక వారికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నా" అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ.. "మద్రాస్ లో నేను, రాజ్ కందుకూరి సినిమానే ప్రాణంగా బ్రతికిన వాళ్ళం మేము, ఆయన బ్యానర్లో సినిమా చేసినందుకు అది సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, నా దృష్టిలో నిజమైన హీరోలు మాత్రం ఆడియన్స్ . ఈ సినిమాను ఆదరించిన ఇంకా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అలాగే చిత్ర యూనిట్ కు అభినందనలు" అన్నారు.

ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ.. "ఈ సినిమా రిలీజ్ కు ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంది, ఒక కొత్త సినిమాను నిర్మించాలంటే ఎంతో ధైర్యం కావాలి బాధ్యత కూడా ఉండాలి అది ఈ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి ఉంది అందుకే సినిమా విజయం సాధించింది. 2017 సంవత్సరం సినిమా కు బాగా కలసి వచ్చింది. నా దృష్టిలో ఒక సినిమా ఇంకో సినిమా కు ఎప్పుడూ పోటీ కాదు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మళయాళ ఇండస్ట్రీ ని బీట్ చేసేలా మన తెలుగు సినిమాలు ఉండాలని, ఇలాంటి మంచి సినిమాలనే మనం చేయాలనీ ఈ సందర్బంగా ఆశిస్తున్నాను, ఇక మెంటల్ మదిలో టీం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాక్షలు తెలుపుతున్నా" అన్నారు.

కథను నమ్మి సినిమాలు చేయాలనుకునే బ్యాచ్ మాది, రియల్ కాన్వాగేషన్స్ ఉన్నాయి ఈ మెంటల్ మదిలో సినిమాలో, నవ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం చూస్తుంటే... బాల చందర్, బాపు లాంటి వారిని గుర్తుకు తెచ్చింది. నిర్మాత రాజ్ కందుకూరి ఆల్రెడీ ప్రూవ్డ్ నిర్మాత. పెళ్లి చూపులు తోనే తన సత్తా ఏంటో చూపించాడు, ఇక శ్రీవిష్ణు అమేజింగ్ యాక్టర్. భవిష్యత్తులో తన సినిమా లు వస్తాయంటే ఎక్సపెక్టేషన్స్ పెట్టుకునే స్థాయికి తను వచ్చేసాడు. ఈచ్ అండ్ ఎవరీ వన్ కంగ్రాట్యులేషన్స్ అని తెలిపారు దర్శకురాలు నందిని రెడ్డి.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ మొదటి సారి నేను వివేక్ రాజ్ కందుకూరి గారిని కలసి నప్పుడు ఆయన మాతో మంచి సినిమా చేస్తే చాలు అని అన్నారు. కానీ ఇప్పుడు ఇంత విజయం సాదిస్తుందని నేను అనుకోలేదు, ఇక చిన్నప్పటి నుంచి నేను యావరేజ్ స్టూడెంట్ ను, టాపర్స్ ను చూసి అందరూ మెచ్చుకుంటుంటే నచ్చేది కాదు, కానీ ఇప్పుడు నన్ను అందరూ మెచ్చుకుంటుంటే చాలా బాగుందని పిస్తోంది చెప్పాలంటే కడుపు నిండిపోతోంది, ఇకపై రాజ్ కందుకూరి సినిమాలను ఎవరూ కంపేర్ చేయరు, ఎందుకంటె అన్నీ మంచి సినిమాలే చేస్తారు కనుక ధర్మపథ బ్యానర్ అంటేనే ప్రతి ఒక్కరూ సినిమాలు చూస్తారు. నాకు అవకాశం ఇచ్చిన వివేక్ కు నిర్మాతకు మరియు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అని అన్నారు

దర్శకుడు వివేక్ మాట్లాడుతూ సక్సెస్ సాధించేంత త్వరగా సినిమా అయిపోయినందుకు బాధగా ఉంది, మంచి టీం ను మిస్ అవుతున్నందుకు మరింత బాధగా ఉంది, మంచి సినిమా చేద్దాం అని రాజ్ కందుకూరి గారు మాతో అన్నారు కానీ ఇంత మంచి ఘన విజయం సాదిస్తుందని ఎక్సపెక్ట్ చేయలేదు. ఏది ఏమైనా మెంటల్ మదిలో సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ, సినిమాకు సపోర్ట్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా అన్నారు.

అనిత చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, సింగర్ రేవంత్, నటులు కిరీటి, అరుణ భిక్షు, భాస్కర్ బట్ల, సిరాజ్ శ్రీ లతో పాటు మెంటల్ మదిలో చిత్ర యూనిట్ మొత్తం ఈ వేడుకలో పాల్గొని తమ అభినందనలను తెలియపరచారు.

More News

'రాజారథం'లో రానా దగ్గుబాటి?

జనవరి 25, 2018న విడుదలకి సిద్దమవుతున్న 'రాజారథం' చిత్రంలో రానా దగ్గుబాటి కూడా భాగమైనట్టు తెలుస్తోంది. 'బాహుబలి'లో 'భళ్లాలదేవుని'గా మెప్పించిన రానా పార్టిసిపేషన్‌ ఎలాంటిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

ఫేవరెట్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నసమంత

ఇటీవ‌లే యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకున్న స‌మంత‌.. ఇప్పుడు తిరిగి సినిమాల‌తో బిజీ అయ్యారు. ఓ వైపు మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్ కి జోడీగా 'రంగస్థలం 1985' చేస్తూనే.. మ‌రోవైపు త‌మిళ క‌థానాయ‌కుడు విశాల్ హీరోగా వస్తున్న‘అభిమన్యుడు' లోనూ న‌టిస్తున్నారు స‌మంత‌.

మిలిటరీ ట్రైనింగ్ అకాడమీలో కమల్ 'విశ్వరూపం 2'

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘విశ్వరూపం 2’ (హిందీలో విశ్వరూప్ 2). ఈ మూవీ షూటింగ్ తిరిగి చెన్నైలో మొదలైంది.

డిసెంబర్ 8న విడుద‌ల‌వుతోన్న 'బీటెక్ బాబులు'

నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్  పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం 'బీటెక్ బాబులు'. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని తెలుగు రాష్ర్టాల్లో  డిసెంబ‌ర్ 8న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 

నాగార్జున చేతుల మీదుగా 'ఏక్‌' మూవీ ఆడియో విడుదల

కె వరల్డ్ మూవీస్ బ్యానర్ పై రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం 'ఏక్'.