సంగీత దర్శకుడు థమన్ చేతుల మీదుగా 'మెట్రో' మదర్ సెంటిమెంట్ సాంగ్ లాంఛ్

  • IndiaGlitz, [Tuesday,February 28 2017]

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై 'ప్రేమిస్తే', 'జ‌ర్నీ', 'పిజ్జా' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -'మెట్రో'. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్లు, రెండు పాట‌ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మ‌ద‌ర్ సెంటిమెంట్ తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునే మ‌రో పాట‌ను సంగీత ద‌ర్శ‌కుడు థ‌మన్ ఆవిష్క‌రించారు. మార్చి 10న సినిమా విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా థ‌మ‌న్ మాట్లాడుతూ '' మ‌ద‌ర్ సెంటిమెంట్ సాంగ్ ను లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ పాట ఎంతో న‌చ్చి లాంచ్ చేస్తున్నాను. ఈ పాట లో ఎంతో సెన్సిటివ్ నెస్ ఉంది. మ‌న‌మంతా ఎలాంటి వాతావ‌ర‌ణంలో ఉన్నామా? అనే ఫీల్ తీసుకొచ్చింది. సురేష్ కొండేటి గారు ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చారు. ఇండ‌స్ర్టీ లో ఏ సినిమా హిట్ అవుతుంద‌న్న విష‌యాన్ని బాగా ఎన‌లైజ్ చేస్తారు. గ‌తంలో ఆయ‌న తెలుగులో రిలీజ్ చేసిన త‌మిళ సినిమాలు ఇక్క‌డా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు త‌మిళ్ లో హిట్ అయిన 'మెట్రో' చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. మంచి హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నా' అని అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ '' మ‌ద‌ర్ సెంటిమెంట్ సాంగ్ ను థ‌మ‌న్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్పుడు మంద‌ర్ సెంటిమెంట్ ను రిలీజ్ చేశాం. అద్భుత‌మైన పాట ఇది. సినిమాకు చాలా కీల‌క‌మైన పాట ఇది. అందరూ న‌చ్చి మెచ్చే సాంగ్ అవుతుంది. మార్చి 10న సినిమా విడుద‌ల చేస్తున్నాం' అని అన్నారు.

నిర్మాత ర‌జ‌నీ రామ్ మాట్లాడుతూ '' ప్ర‌స్తుతం చైన్ స్నాచింగ్స్ తెలుగు రాష్ర్టాల్లో బ‌ర్నింగ్ టాపిక్. అలాంటి క‌థాశంతో తెర‌కెక్కి త‌మిళ్ లో హిట్ అయిన మెట్రోను తెలుగులోకి నాణ్యంగా అనువాదం చేశాం. సాహితి చ‌క్క‌ని మాట‌లు-పాట‌లు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న‌ట్టే ఉంటుంది. మార్చి 10న సినిమా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం '' అని అన్నారు.

More News

హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...' ద్వితీయ ప్రచార చిత్రం, పాట విడుదల

ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రమిది.ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి నరసారావు పేటలో జరిగింది.

దేవిశ్రీ ప్రసాద్ గురుస్మరణ

మాతృదేవోభవ,పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అనే నేర్పించారు.దేవిశ్రీ ప్రసాద్ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ మాటలను అసలు మర్చిపోలేదు.

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల

ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్,భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' గుమ్మడికాయ వేడుక

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట`

5 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' టీజర్

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్.