close
Choose your channels

మందుబాబులకు మెట్రో న్యూ ఇయర్ బంపరాఫర్!

Monday, December 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మందుబాబులకు మెట్రో ఆఫర్ ఇవ్వడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఈ బంపరాఫర్ మరెక్కడో... మరెవ్వరికో కాదండోయ్.. మన హైదరాబాద్‌లోనే. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి..? ఎందుకిచ్చింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అనుకున్నట్లుగానే థర్టీ ఫస్ట్ డిసెంబర్‌ను మెట్రో బాగానే క్యాష్ చేసుకునేందుకు వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మందుబాబులకు మెట్రో బంపరాఫర్ ఇచ్చింది. వాస్తవానికి మద్యం తాగితే మెట్రో రైల్లోకి అనుమతి ఉండదు. అయితే న్యూయర్‌ను పురస్కరించుకుని మద్యం తాగిన వారిని కూడా మెట్రోలో అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నిజంగా మందుబాబులకు న్యూయర్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కండిషన్స్ మాత్రం వర్తిస్తాయని.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని మెట్రో హెచ్చరించింది. మరి ఎన్నెన్ని గొడవలు జరుగుతాయో..? ఏంటో చూడాలి.!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.