Michael:'మైఖేల్' ఫిబ్రవరి 3న విడుదల

  • IndiaGlitz, [Tuesday,January 03 2023]

ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ (Sundeep Kishan)మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' (Michael). రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన 'నువ్వుంటే చాలు' ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు

More News

Kitchcha Sudeep: సమంతకు మయోసైటిస్ .. ఫోన్ చేసి కూడా పలకరించలేదు, ఎందుకంటే : సుదీప్

వెరైటీ కథలు, వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తారు కన్నడ స్టార్ హీరో సుదీప్. హిట్టూ, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్టైల్. ఆయన తెలుగు

Naresh-Pavitra Lokesh : పవిత్రకు లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన, ఏకంగా వీడియో రిలీజ్

పవిత్రా లోకేష్- వీకే నరేష్.. ఈ రెండు పరిచయం లేని పేర్లు. లేటు వయసులో ఈ ఆంటీ అంకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కుర్రాళ్లు కూడా ఈ రేంజ్‌లో హల్‌చల్ చేయరేమో.

Youthful Love Story:ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం!!!

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 5 గా తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

Top 10 Movies: ఈ ఏడాది బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించిన టాప్ 10 చిత్రాలివే..!!

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.

Unstoppable - 2: ఇప్పటినుండి నువ్వు నన్ను అలానే పిలవాలి - ప్రభాస్ తో  బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ 2