బాహుబలి 2 కోసం మిల్కీబ్యూటీ

  • IndiaGlitz, [Monday,May 30 2016]
ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబలి ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు రాజ‌మౌళి బాహుబ‌లి 2 తో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి బాహుబ‌లి 2 క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...బాహ‌బ‌లి లో అవంతిక పాత్ర‌లో అద్భుత అభిన‌యం ప్ర‌ద‌ర్శించి మంచిపేరు తెచ్చుకున్న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి 2 షూటింగ్ కో్సం రెడీ అవుతుంది. జులై ఫ‌స్ట్ వీక్ నుంచి త‌మ‌న్నా పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు.త‌న‌కు ఎంత‌గానో పేరు తీసుకువ‌చ్చిన అవంతిక పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తూ...ఎప్పుడెప్పుడు అవంతిక పాత్ర మళ్లీ చేస్తానా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను అంటుంది మిల్కీబ్యూటీ.

More News

తండ్రి బాటలో విష్ణు....

మోహన్ బాబు నటుడిగానే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి ఏటా వేలాది మంది విద్యార్థులకు చదువును అందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న'టైటానిక్'

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’.

ఫ‌స్ట్ టైమ్ సారీ చెప్పిన వ‌ర్మ‌

సంచ‌ల‌నానికి...వివాదానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ...ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ త‌నకు  ఏది అనిపిస్తే...అది దాచుకోకుండా...మ‌న‌సులో మాట‌ల‌ను ట్విట్ట‌ర్ లో పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంటారు.

నెల్లూరు లో హీరో సూర్య...

తమిళ హీరో సూర్య నటించిన 24మూవీ ఇటీవల రిలీజై విజయం సాధించిన విషయం తెలిసిందే.

రోబో సీక్వెల్ కి కమల్ నో చెప్పడానికి కారణం ఇదే..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రోబో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా రోబో 2.0 తెరకెక్కుతుంది.