బర్డ్ ఫ్లూ పై యుద్ధం ప్రకటించాం


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, మరికొన్ని జిల్లాల్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మరిన్ని జిల్లాలతో పాటు, తెలంగాణ కు కూడా ఇది వ్యాపించింది. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్లు మృతిపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు. క్షేత్ర స్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించిన మంత్రి.. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్‍కు పంపాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని చెప్పిన మంత్రి.. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీచేశారు.
పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని ఆదేశాలు జారీచేశారు అచ్చెంనాయుడు. చనిపోయిన కోళ్లను సరైన పద్ధతిలో ఖననం చేయాలని, పౌల్ట్రీ అంతటా పరిశుభ్రత పాటించాలని సూచించారు. దీంతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరమని సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com