close
Choose your channels

నవ్యాంధ్ర రాజధాని మార్పుపై అసెంబ్లీలో కీలక ప్రకటన

Friday, December 13, 2019 • తెలుగు Comments

నవ్యాంధ్ర రాజధాని మార్పుపై అసెంబ్లీలో కీలక ప్రకటన

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై సస్పెన్స్.. సస్పెన్స్. అసలు రాజధాని అమరావతిలోనే పెడతారా..? లేదా..? అనేది క్లారిటీ రాకపోవడం.. మరోవైపు మంత్రి బొత్సా సత్యనారాయణ రోజుకో ప్రకటన చేయడం రాజధానికి భూములిచ్చిన రైతులు డైలామాలో పడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తుండటం.. రాజధాని రైతులు ధర్నాలు, నిరసనలతో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారంపై పెద్ద హడావుడే జరిగింది. అయితే నేడు అనగా శుక్రవారం ఆ అనుమానాలన్నీ పటా పంచ్‌లయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నవ్యాంధ్ర రాజధానిపై మంత్రి బొత్సా సత్యనారాయణ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.

క్లారిటీ ఇచ్చేసిన మంత్రి!
అమరావతిని మారుస్తున్నారా? అని ఇవాళ శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అంతేకాదు.. అమరావతి కోసం ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధుల వివరాల గురించి సభలో చెప్పాలని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు బొత్స ఒక్క మాటతోనే లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ‘అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదు’ అని మంత్రి బొత్స తేల్చేశారు. మొత్తానికి చూస్తే ఇన్ని రోజులుగా రాజధానిపై నెలకొన్న డైలామాకు మంత్రి తాజా ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చేసింది.

భవనాల సంగతేంటి సారూ..!
రాజధానిని అమరావతి నుంచి తరలించట్లేదు సరే.. నూతర నిర్మాణాల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తారు..? ఇప్పుడు నిర్మించిన తాత్కాలిక భవనాల సంగతేంటి..? హైకోర్టు తప్ప మిగిలినవన్నీ తాత్కాలిక భవనాలే..? వాటి సంగతేంటి..? ఇలా ఇంకా అనుమానాలు చాలానే ఉన్నాయి.. ఈ విషయంలో మాత్రం మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. రాజధాని నిర్మాణాల విషయంలోనూ గత ప్రభుత్వం కంటే భిన్నమైన మార్గంలో వెళ్లాలని భావిస్తోంది. అంతేకాదు.. రాజధాని నిర్మాణం విషయంలో హంగు ఆర్భాటం కాకుండా... వాస్తవికంగా ముందుకు సాగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసలు అమరావతి నిర్మాణం సంగతేంటి..? ప్లాన్స్ ఏంటి..? అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే మరి. 

Get Breaking News Alerts From IndiaGlitz