హేమమాలిని బుగ్గల్లా రోడ్లు తయారుచేస్తా!!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. పై మాట అన్నది ఓ స్టేట్ మినిస్టర్.. డ్రీమ్‌గాళ్ అంటే అమితంగా అభిమానించే ఆ మంత్రి ఆమె బుగ్గలను రోడ్లతో పోలుస్తూ.. అలా తయారుచేస్తానంటూ కామెంట్ చేశారు. సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు ఎవరీ మంత్రి..? ఎందుకు ఇలా అన్నారనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
డ్రీమ్‌గాళ్.. అందాలతార.. హేమమాలిని పుట్టిన రోజు నేడు. నేటితో ఈ అందాల భామ 71వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వీరాభిమానులు, మరికొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే హేమమాలిని పుట్టిన రోజున మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ మాత్రం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇవాళ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్ గంజ్ ప్రాంతంలో రోడ్లను పరిశీలించిన ఆయన.. ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. రోడ్లు గుంతలు పడ్డాయని.. వర్షం థాటికి ఇలా పోతున్నాయని 15 రోజుల్లో రోడ్డన్నీ సక్రమం చేస్తానని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. రోడ్లన్నీ హేమమాలిని బుగ్గల్లా తయారుచేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న కొందరు నెటిజన్లు నవ్వుకోగా.. వామ్మో ఈ మంత్రిగారేంటి డ్రీమ్గాళ్కు ఇంత వీరాభిమానా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై హేమమాలిని మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. మరి రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో పరిస్థితి వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.