లగడపాటి సర్వే పై మండిపడ్డ మంత్రి

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

టీడీపీ గెలుస్తుందని.. ఎవరి సపోర్ట్ లేకుండా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ప్లాష్ టీమ్ సర్వేతో తేల్చిన సంగతి తెలిసిందే. లగడపాటితో పాటు ఎలైట్ లాంటి ఒకటి అర సర్వేలు టీడీపీనే గెలుస్తుందని తేల్చాయి. అయితే లగడపాటి చిలకజోస్యాలను మాత్రం సొంత పార్టీ నేతలు, మంత్రులు నమ్మట్లేదు.. అంతేకాదు మీడియా ముందుకొచ్చి ఆక్టోపస్ సర్వేను తప్పుబడుతున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అయ్యన్న పాత్రుడు సర్వేపై పై విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ గెలవదన్న విషయం మంత్రులు, తెలుగు తమ్ముళ్లకు కళ్లకు కట్టినట్లుగా స్పష్టంగా సీన్ అర్థమైపోయిందని అందుకే.. మంత్రి ఇలా మాట్లాడుతున్నారంటూ అటు అధికార.. ఇటు వైసీపీ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రజల నాడి వాళ్లకేం తెలుసు!

మంగళవారం ఓ కార్యక్రమంలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. లగడపాటి సర్వేపై మీ అభిప్రాయమేంటని అడగ్గా.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. ప్రజల నాడి తెలిసినవాళ్లు ఎగ్జిట్‌ పోల్‌ చేయాలని.. అంతేకానీ ప్రజల నాడి తెలియనివాళ్లు.. పనికిమాలినవాళ్లు ఎగ్జిట్ పోల్స్ చేస్తే ప్రమాదమని వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో ఎలాగూ ఫలితాలు వస్తాయి.. అంతా తెలిసిపోతుంది.. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదన్నారు. ఇలాంటి సర్వేల వల్ల పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయన్నారు.

వెయ్యి కోట్ల తగలెట్టేశారు!

మొన్న తెలంగాణ ఎన్నికల్లో.. బెజవాడాయన లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్‌కు కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లు పందేలు కాశారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌తో సర్వనాశనమయ్యారు. హైదరాబాద్‌ ఓ పెళ్లికి వెళితే ఆయన మాట నమ్మి నాశనమయ్యాం సార్ అంటూ బాధను చెప్పుకున్నారు. లగడపాటి ఎందుకు అలా సర్వే ఇవ్వాలి అంటూ తీవ్ర స్థాయిలో అయ్యన్న మండిపడ్డారు.

అయితే ఇన్ని మాటలు మాట్లాడిన అయ్యన్న.. కనీసం కచ్చితంగా మరోసారి మేం గెలుస్తామని చెప్పకపోవడం గమనార్హం. సో ఈ వ్యాఖ్యలను బట్టి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. టీడీపీ గెలుస్తుందని కోట్లు పందేలు కాసిన బెట్టింగ్ రాయుళ్లు, టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు లగడపాటి సర్వేతో ఫుల్ జోష్‌లో ఉంటే.. అయ్యన్న వ్యాఖ్యలతో మంత్రి ఆశలు ఆవిరై.. పూర్తిగా నమ్మకం పోయి నైరాశ్యంలో పడ్డారు.

More News

ఫలితాల తర్వాత టీడీపీలో చీలికలు.. నారా వర్సెస్ నందమూరి!?

అవును.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ చీలికలు తప్పవని.. నారా వర్సెస్ నందమూరిగా పరిస్థితులు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓ నేత జోస్యం చెప్పారు.

'విశ్వామిత్ర' సెన్సార్ పూర్తి... జూన్ 14న విడుదల! 

అనగనగా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందన్న సమయంలో సమస్యలు ఆమెను చుట్టుముడతాయి. వాటిని ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు.

డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌తో మ‌హేష్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అంటే ఎలా ఉండాలి? ప‌క్కా మాస్‌, క్లాస్ క‌ల‌గ‌లిసిన హీరో. అభిమానులకు, నిర్మాత‌ల‌కు బాక్సాఫీస్ బొనాంజా. త‌మ హీరోను ఏ మాత్రం త‌క్కువ‌గా చేసి చూపినా అభిమానులు అస్స‌లు ఒప్పుకోరు.

హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' కొత్త షెడ్యూల్‌

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2

‘అజిత్’ చనిపోతూ ఆరుగురిని బతికించాడు!

'అజిత్' అనే యువకుడు చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. మే-15న హైదరాబాద్‌లో అజిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైటెక్ సిటీ వద్ద వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది.