close
Choose your channels

క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

Friday, June 2, 2023 • తెలుగు Comments
KTR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

కల్వకుంట్ల తారక రామారావు.. షార్ట్ కట్‌లో కేటీఆర్ . ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన వారసుడిగా ఆయన రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. అందరు వారసుల్లాగా వచ్చిన వెంటనే పదవిని అందుకోకుండా.. తెలంగాణ ఉద్యమంలో తండ్రికి బాసటగా నిలిచారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొని రాజకీయ నాయకుడిగా రాటుదేలారు. హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకోకుండా రాజకీయాలు అవసరమా అన్న వాళ్లకి తన చేతలతోనే సమాధానం చెప్పారు కేటీఆర్. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ వంటి కీలక పదవులు చేపట్టిన కేటీఆర్.. హైదరాబాద్ నగర అభివృద్దిలో తన మార్క్ చూపిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేటీఆర్.. రాబోయే రోజుల్లో సీఎం అవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివిన కేటీఆర్ :

వీలున్నప్పుడల్లా తన చిన్ననాటి గుర్తులు, కాలేజ్ రోజులను కేటీఆర్ గుర్తుచేసుకుంటూ వుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటారు. తాజాగా ఆయన పూణేలో బయో టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్న రోజులను , తన మిత్రులను తలచుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పిక్స్ షేర్ చేశారు. యూనివర్సిటీ క్యాంటీన్‌లో మిత్రులతో సరదాగా గడుపుతున్న ఫోటోలతో పాటు ట్రెక్కింగ్ చేస్తున్న పిక్‌ను ఆయన షేర్ చేశారు. నూనుగు మీసాలతో ఇప్పుడు ఆయన కుమారుడు హిమాన్షు ఎలా వున్నారో కేటీఆర్ అలా వున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తండ్రి కోసం ఉద్యోగం మానేసి .. ఉద్యమంలోకి :

ఇకపోతే.. 1976 జూలై 24న కేసీఆర్, శోభా రావు దంపతులకు కేటీఆర్ జన్మించారు. కరీంనగర్, హైదరాబాద్, గుంటూరు, పూణే, న్యూయార్క్‌లలో ఆయన విద్యాభ్యాసం గడిచింది. పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ చేయగా.. సిటి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక కొద్దిరోజులు అమెరికాలోని ఓ బడా కంపెనీలో ఉద్యోగం చేసిన కేటీఆర్.. 2006లో భారతదేశానికి తిరిగి వచ్చి తండ్రి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. 2009, 2010, 2014, 2018లలో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.