close
Choose your channels

'భగత్ సింగ్ నగర్' ఆడియో విడుదల చేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్

Saturday, October 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భగత్ సింగ్ నగర్ ఆడియో విడుదల చేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్

భగత్ సింగ్ నగర్ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం వైజాగ్ లో వి.ఎమ్.ఆర్.డి.ఎ చిల్డర్న్స్ అరినలో జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసారు. సినీ దర్శకుడు బాబ్జి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిర్మాత మళ్లా విజయ్ ప్రసాద్, పువ్వాడ శోభన్ ప్రకాష్ కంకటాల మల్లిక్ వ్యాపారవేత్తలు ఉడత్తు కాశీ విశ్వనాధం, ఉసిరికల చంద్ర శేఖర్ రావ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విద్యార్థి నాయకుడు ఆడారి కిషోర్, లహరి మ్యూజిక్ అధినేత ఇంటి శ్రీనివాస్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... భగత్ సింగ్ గొప్ప స్వతంత్ర సమరయోధుడు. అతని పేరుతో సినిమా చేస్తుండడం నాకు నచ్చింది. యువత ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. నాకు భగత్ సింగ్ అంటే ఇష్టం. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి చిత్ర దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్న. చిత్రంలోని పాటలు బావున్నాయి, సంగీతం వైవిధ్యంగా ఉంది అన్నారు.

సిపిఐ ఆంధ్ర జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ... భగత్ సింగ్ పేరులోనే పవర్ ఉంది, సక్సెస్ ఉంది. ఆ పేరే అందరిని ఈ ఫంక్షన్ కు తీసుకొచ్చింది. రేవు థియేటర్ కు కూడా అదే పేరు తీసుకొని వస్తుంది. ఈ సినిమా పాటలు బాగున్నాయి. సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ బాబ్జి మాట్లాడుతూ... రమేష్ లాంటి నిర్మాతలు అవసరం. బయటి దేశంలో నివసిస్తున్న ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. యూకే లో తెలుగు పండగ అయిన ఉగాదిని బ్రిటన్ ఎంపీ తో సెలబ్రేట్ చేయించారు. మన తెలుగు భాష మీద ప్రేమతో ఆయన ఈ విధంగా చెయ్యడం హర్శించదగ్గ విషయం. ఈ సినిమా ఆయన కోసం పెద్ద సక్సెస్ అవ్వాలని, ఆయన మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత రమేష్ ఉడత్తు మాట్లాడుతూ... భగత్ సింగ్ నగర్ సినిమాను నిర్మించినందుకు గర్వాంగా ఉంది. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ను దర్శకుడు అందంగా చూపించారు. దర్శకుడు క్రాంతి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశాను. నా రెండో సినిమా కూడా క్రాంతి తోనే చెయ్యబోతున్నాను అన్నారు.

డైరెక్టర్ వాలాజా క్రాంతి మాట్లాడుతూ... భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ ఇది. అందరూ కొత్తవారు ఈ చిత్రంలో నటించారు. భగత్ సింగ్ రాసిన ఒక లైన్ ను తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమను తెరకెక్కించడం జరిగింది. బెనర్జీ, రవి ప్రకాష్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నీ కమర్షియల్ హంగులతోటి ఈ సినిమా ఉండబోతోంది. పాటలు అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ తో సాంగ్స్ ఉండబోతున్నాయి అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.