క్రీడాంధ్రప్రదేశ్ కోసం రాంప్రసాద్ ప్రయత్నం


Send us your feedback to audioarticles@vaarta.com


సీఎం చంద్రబాబు సారథ్యంలో క్రీడాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని, ఇప్పటికే అత్యుత్తమ క్రీడా పాలసీ, క్రీడా యాప్ ఆవిష్కరణ వంటి అంశాలు కూటమి ప్రభుత్వం హయంలో జరిగాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా,యవజన,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసి పూల బొకేతో సత్కరించారు. అనంతరం యువతకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాలు అందించాలని కోరారు.
రాష్ట్రంలో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి మద్దతు కోరిన మంత్రి.. ఏపీలోని అన్ని నగరాల్లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు 280.9 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి 42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో నూతనంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్, జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం స్వీకరించిన మాండవీయ, ఏప్రిల్ లో ఏపీలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com