TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

  • IndiaGlitz, [Thursday,May 25 2023]

తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6 జోన్‌లలో పరీక్షలను నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 79 శాతం మంది బాలురు, 82 శాతం మంది బాలికలు పాస్ అవ్వగా.. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు, 87 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి మంత్రి సబిత అభినందనలు తెలిపారు.

రెండు విభాగాల్లోనూ టాప్ 5లో నలుగురు ఏపీ వాళ్లే :

అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి వెల్లడించారు. ఈ స్ట్రీమ్‌లో 1,10,544 మంది పరీక్షలు రాయగా.. 91,935 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,53,890 మంది తెలంగాణ విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఏపీ నుంచి 51,461 మంది పరీక్షలు రాశారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. ఇంజనీరింగ్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన సనపల్ల అనిరుధ్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కేటగిరీలో టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన విద్యార్ధులే వుండటం గమనార్హం. జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం వుంది. స్థానిక విద్యార్ధుల కోసం 85 శాతం , స్థానికేతరుల కోసం 15 శాతం సీట్లు కేటాయించారు.

More News

Tiger Nageswara Rao:‘‘పులుల్ని వేటాడే పులిని చూశావా ’’: గజదొంగగా భయపెడుతోన్న రవితేజ , 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ గ్లింప్స్ సూపర్బ్

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ మంచి జోరులో వున్నారు. 50 ప్లస్‌లోనూ కుర్ర హీరోల కంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నారు.

White House:అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. వైట్‌హౌస్‌లోకి ట్రక్కుతో చొచ్చుకెళ్లే యత్నం, తెలుగు యువకుడు అరెస్ట్

ప్రపంచాన్ని కనుసైగతో శాసించే అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడికి ఏ స్థాయిలో భద్రత వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Civils Results:సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల .. తెలంగాణ అమ్మాయికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్ధులను యూపీఎస్సీ ఎంపిక చేసింది.

YS Jagan:సీఎంగా నాలుగేళ్లు .. మళ్లీ నువ్వే రావాలి జగనన్న, ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌లోకి

తండ్రి మరణం, సీబీఐ , ఐటీ కేసులు, జైలు జీవితం ఇలా సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటూనే తన కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు

Dimple Hayathi:ఐపీఎస్‌తో గొడవ .. 'సత్యమేవ జయతే' అంటూ డింపుల్ హయతి ట్వీట్

డింపుల్ హయాతి.. అచ్చ తెలుగమ్మాయి. నటన, డ్యాన్స్, అందం ఇలా అన్నింటిలోనూ టాలెంట్ వున్నా.. అదృష్టం లేకపోవడంతో స్టార్ స్టేటస్ రాలేదు.