దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Monday,September 28 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వెల్లంపల్లి సీఎం జగన్‌తో కలిసి తిరుమలలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు వెల్లంపల్లి తిరుమలలో ఉన్నారు. అలాగే సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వారం రోజుల పాటు తిరుమలలో ఉన్న అనంతరం వెల్లంపల్లి నెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

More News

దేవి నాగవల్లి ఎలిమినేట్ అవడానికి కారణాలివే...!

బిగ్‌బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. అయితే మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు.

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో మూవీ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది.

దేవి ఎలిమినేట్.. బాగా గేమ్ ప్లే చేస్తున్న బిగ్‌బాస్..

సన్ డే.. ఫన్ డే కాబట్టి సందడి సందడిగా సాగిపోయింది. ‘మన రికార్డ్ మనమే బ్రేక్ చేసుకుందాం’ టాస్క్‌లో భాగంగా ముందు అభిజిత్..

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన నటి హేమ..

సినీ నటి హేమ ఓపెన్ డిగ్రీ పరీక్షలకు హాజరయ్యారు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన హేమ..

23 ఏళ్ల బంధం ముగిసింది.. ఎన్డీయేకు శిరోమనీ అకాలీదళ్ గుడ్ బై..

సుదీర్ఘ ప్రయాణం.. అర్థంతరంగా ముగిసింది. ఎన్డీఏ, శిరోమనీ అకాలీదళ్‌ల మధ్య వ్యవసాయ బిల్లులు చిచ్చు పెట్టాయి.