close
Choose your channels

వైఎస్ జగన్ కేబినెట్‌లోని మంత్రులు వీళ్లే...!

Saturday, May 25, 2019 • తెలుగు Comments

వైఎస్ జగన్ కేబినెట్‌లోని మంత్రులు వీళ్లే...!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణం చేస్తారు..? ఇంతకీ జగన్‌ కేబినెట్‌లో పనిచేసే అదృష్టం ఎవరికి దక్కుతుంది..? సామాజిక వర్గాల పరంగా జగన్ ఏ మేరకు న్యాయం చేస్తారు..? గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలల్లో ఎంత మంది సీనియర్లకు ప్రాధన్యత ఇస్తారు..? అని ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ జనాల్లో సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఓ జాబితా వైరల్ అవుతోంది.

వైసీపీ వర్గాల్లో వైరల్ అవుతున్న మంత్రుల జాబితా ఇదే...

ముఖ్యమంత్రి : వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

స్పీకర్ : రోజా లేదా ఆనం రామనారాయణ రెడ్డి

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

రెవెన్యూ శాఖ : ధర్మాన ప్రసాద రావు

హోంశాఖ : పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

ఆర్థిక శాఖ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

రోడ్స్ & భవనాలు : బొత్స సత్యనారాయణ

భారీ నీటి పారుదల : కొడాలి వెంకటేశ్వర రావు (కొడాలి నాని)

మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి

స్త్రీ శిశువు సంక్షేమం : తానేటి వనితా

పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ చేసి)

వైద్య శాఖ : అవంతి శ్రీనివాస్

విద్య శాఖ : కురసాల కన్నబాబు

బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం

అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి

దేవాదాయ : కోన రఘుపతి

పంచాయతీ రాజ్ : అనంత వెంకట్రామిరెడ్డి

ఐటీ : మేకపాటి గౌతం

విద్యుత్ శాఖ : తమ్మినేని సీతారాం

మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: గ్రంధి శ్రీనివాస్

కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని

సాంఘిక సంక్షేమం : కె. భాగ్యలక్ష్మి

వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి

మార్కెటింగ్, పశుసంవర్థకం : అనిల్ కుమార్ యాదవ్‌

గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి

పరిశ్రమల శాఖ: కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (ఎమ్మెల్సీ కోటా)లో మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జగన్‌తో పాటే ప్రమాణ స్వీకారం..

కాగా.. తనతో పాటే మొత్తం కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయించాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జగన్‌తో సమావేశమైన సమయంలో సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారని సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గతంలో అవకాశం లేని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారని తెలుస్తోంది. దీంతో..జగన్ చేస్తన్న ఈ కసరత్తులో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేది చూడాలి. ఒకట్రెండు కాదు.. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎవరెవరికి జగన్ న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz