అసెంబ్లీ సాక్షిగా నిబంధనలకు పాతరేసిన మంత్రులు.. హెచ్చరించిన స్పీకర్..

  • IndiaGlitz, [Thursday,September 10 2020]

ప్రజలకు హితబోధ చేయాల్సిన మంత్రులే ఇష్టానుసారం వ్యవహిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కోవిడ్ నిబంధనలకు పాతరేసిన మంత్రుల విషయంలో స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలుగ జేసుకుని చురకటించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క సభ్యుడికి కరోనా పరీక్షలు నిర్వహించిన మీదటే అసెంబ్లీలోకి అనుమతించారు. వారికి కేటాయించిన సీట్ల విషయంలో కూడా అత్యంత జాగ్రత్త వహించారు.

గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్తు ఆరోగ్యశాఖా మంత్రితో పాటు మరో మంత్రి కోవిడ్ నిబంధనలకు పాతరెయ్యడం విస్మయాన్ని కలుగజేసింది. కోవిడ్ తీవ్ర రూపం దాల్చిన ఈ పరిస్థితుల్లో మంత్రులు ఈటల రాజేందర్ పక్కనే ఉన్న నో సీటింగ్‌ చైర్‌లో జగదీష్‌రెడ్డి కూర్చున్నారు. జగదీష్‌రెడ్డి తన పక్కన కూర్చున్నప్పటికీ ఆరోగ్యశాఖ మంత్రి అయిన ఈటల ఎలాంటి అభ్యంతరమూ తెలపలేదు. దీనిని గమనించిన స్పీకర్ నో-సీటింగ్ సీట్‌లో కూర్చోవద్దంటూ హెచ్చరించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి జగదీష్‌రెడ్డి వెళ్లిపోయారు.

సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ సూచించారు. కాగా.. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి స్పీచ్‌కు మంత్రులు ఈటల, ఎర్రబెల్లి అడ్డుపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ సమస్యపై సమాధానం చెబుతూ ఎక్కువ సమయాన్ని నిరంజన్‌రెడ్డి తీసుకున్నారు. దీంతో స్పీకర్‌కు ఈటల, ఎర్రబెల్లి సమయాన్ని గుర్తు చేయడం గమనార్హం. ఒక్క ప్రశ్నకు ఎంత సమయం తీసుకుంటారని ఆయా మంత్రులు ప్రశ్నించారు. మంత్రులు అడ్డు చెప్పడంతో నిరంజన్‌రెడ్డి స్పీచ్‌ను ముగించారు.

More News

మెదక్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో సహా 5గురి అరెస్ట్

ఏసీబీ వలకు బుధవారం చిక్కిన భారీ అవినీతి తిమింగళం సహా మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

‘వకీల్‌సాబ్’లో చేసిన తొలిమార్పు అదే.. పవన్‌ మెచ్చుకున్నారు: వేణు శ్రీరామ్

‘వకీల్‌సాబ్’ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

శివసేన- కంగనల మధ్య పోరు కొత్త మలుపు..  మంచే జరిగింది!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనకు ఏమైంది..? అంతమందికి టార్గెట్ అయ్యేందుకు ఆమె చేసిన తప్పేంటి?

‘వకీల్‌సాబ్‌’లో పవన్ ఎంట్రీ కొంచెం లేటుగా ఉంటుంది: వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘వకీల్‌ సాబ్‌’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో

షూటింగ్ షురూ చేసిన మ‌హేశ్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఎట్ట‌కేల‌కు షూటింగ్ స్టార్ట్ చేశారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత మ‌హేశ్ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు.