close
Choose your channels

చిరు-నాగ్‌లతో మంత్రి తలసాని కీలక భేటీ

Monday, February 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు-నాగ్‌లతో మంత్రి తలసాని కీలక భేటీ

టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు. ఇదివరకే ఒకసారి ఈ ఇద్దరితో భేటీ అయిన ఆయన.. తాజాగా మరోసారి కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వేదికైంది. సుమారు గంట నుంచి వీరి మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా భేటీలో ఏమేం చర్చిస్తున్నారు..? ఇండస్ట్రీ అభివృద్ధి గురించి చర్చిస్తున్నారా..? లేకుంటే మరేమైనా విషయాలపై చర్చిస్తున్నారా..? అనేదానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఏం చర్చిస్తున్నారు..!

అయితే.. చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఇంకా కొనసాగుతున్నదని బయటికి వార్తలు వస్తున్నాయి. ఇదివరకే జరిగిన భేటీలో నాలుగువేల ఎకరాల్లో ఫిల్మ్ హబ్‌ను అభివృద్ధి చేయాలని చర్చించినట్ల అప్పట్లో మీడియాకు సమాచారం అందించారు. ఆ అభివృద్ధి గురించే చర్చిస్తున్నారా..? ఇంకేమైనా చర్చిస్తున్నారా..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. భేటీ అనంతరం ఇందుకు సంబంది పూర్తి విరాలు మీడియాకు అందే అవకాశాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.