'మిస్ ఇండియా' కు ముహూర్తం కుదిరింది

  • IndiaGlitz, [Wednesday,February 19 2020]

‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత మహేశ్ కోనేరు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ సినిమా కోసం కీర్తి సురేశ్ పూర్తిగా త‌న లుక్‌ను మార్చుకుంది. అప్ప‌టి వ‌ర‌కు బొద్దుగా క‌న‌ప‌డ్డ ఈ అమ్మ‌డు బ‌రువు పూర్తిగా తగ్గిపోయింది.

జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్‌చంద్ర‌, వి.కె.న‌రేశ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్‌.ఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మాయిలు ఎదుర్కొంటున్న స‌మకాళీన స‌మ‌స్య‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న కీర్తిసురేశ్ మిస్ ఇండియా సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది. మ‌రి ఈ సినిమా కీర్తికి ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే.

More News

'భీష్మ'గా అందర్నీ నవ్విస్తా! - హీరో నితిన్

"నేను మీమ్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్ చేశాను. అందుకే 'భీష్మ'లో ప్రతి సీనూ ఫన్నీగా ఉంటుంది. విలన్ కు వార్నింగ్ ఇవ్వడంలోనూ ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది.

షూటింగ్‌లో అజిత్‌కు గాయాలు

కోలీవుడ్ అగ్ర క‌థానాయకుడు అజిత్ ప్ర‌స్తుతం  త‌న 60వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఖాకి ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో

అఫీషియ‌ల్‌:  ఎన్టీఆర్ 30.. త్రివిక్ర‌మే ద‌ర్శ‌కుడు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌`

సూపర్‌స్టార్ రజనీ మోషన్ పోస్టర్ అదుర్స్...

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ కార్యక్రమం డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది.

12000 ఎకరాల్లో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో వెంకటేష్ 'నారప్ప'

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం 'నారప్ప'. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్‌'