'2 స్టేట్స్‌' లో మిస్ విజ‌య‌వాడ‌

  • IndiaGlitz, [Friday,March 30 2018]

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌'. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల '2 స్టేట్స్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్రలో మిస్ విజ‌య‌వాడ ప్రియా చౌద‌రి న‌టించ‌నుంది. ఏప్రిల్ 5 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అందులో లిజి, ఆదిత్య మీన‌న్ స‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారులు న‌టించ‌నున్నారు.

రెండో షెడ్యూల్‌ను కోల్‌క‌తాలో చిత్రీక‌రిస్తారు. మూడో షెడ్యూల్‌ను యు.ఎస్‌లో చిత్రీక‌రిస్తారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌రెడీ మంచి విజ‌యాన్ని సాధించింది. 

More News

మ‌ల్టీస్టార‌ర్ కోసం మూడు నిర్మాణ సంస్థ‌లు...

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సంస్కృతి ఎక్కువ అవుతుంది. అందులో భాగంగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది.

ఆరో స్థానంలో 'రంగ‌స్థ‌లం'

1985 కాలం నాటి ప‌రిస్థితుల‌తో.. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంగా 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్.

చ‌ర‌ణ్ ఎంట్రీ డేట్ ఫిక్స‌య్యింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

'మ‌ణిక‌ర్ణిక' షూటింగ్ పూర్తి

భిన్నమైన కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితం ఆధారంగా 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు.

గ్రాఫిక్స్ హైలెట్ గా అరుంధతి అమావాస్య

కె వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో, శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకం పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''అరుంధతి అమావాస్య''.