చెన్నై లో 'మిక్చర్' పొట్లం ప్రీమియర్ షో

  • IndiaGlitz, [Thursday,May 11 2017]

శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు ఈ మిక్చర్ పొట్లం చిత్రంతో . గీతాంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించగా గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు లక్ష్మీ ప్రసాద్ , కంటే వీరన్న చౌదరీ , లంకపల్లి శ్రీనివాసరావు లు సంయుక్తంగా నిర్మించారు . వెటరన్ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.
మిక్చర్ పొట్లం రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో చెన్నై లో ఈ చిత్ర ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు . ఈ షో ని చూసినవాళ్లలో దర్శకులు , నటులు కే భాగ్యరాజా దంపతులు , మాజీ హీరోయిన్ లిజి , భానుచందర్ , ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , చారుహాసన్ ,వెన్నెలకంటి తదితరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు . మిక్చర్ పొట్లం ని చూసిన భాగ్యరాజా , ఎస్పీ బాలు , లిజి , చారుహాసన్ లు అభినందనలతో ముంచెత్తారు . మిక్చర్ పొట్లం సినిమా చాలా బాగుందని తప్పకుండా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు అందజేశారు.
చిత్ర నిర్మాతలు కలపటపు లక్ష్మీప్రసాద్ ,కంటే వీరన్న చౌదరి , లంకపల్లి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ ' ' మిక్చర్ పొట్లం తో తొలి ప్రయత్నంగా చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చామని , అన్ని అంశాలతో ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రూపొందిందని ....... మా మిక్చర్ పొట్లం ప్రీమియర్ షోకి కేరళ నుండి ప్రత్యేకంగా చెన్నై కి అది కూడా సతీసమేతంగా రావడం మా అదృష్టమని అలాగే భాగ్యరాజా గారికి మా సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు .
దర్శకులు ఎంవి సతీష్ మాట్లాడుతూ '' చెన్నై లో జరిగిన ప్రీమియర్ షోకి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని , అన్నింటికీ మించి సినిమా రంగంలో లెజెండ్స్ అయిన కే భాగ్యరాజా , చారుహాసన్ , మాజీ హీరోయిన్ లిజి లతో పాటు పలువురు సినీ ప్రముఖులు మా చిత్రాన్ని చూసి అభినందించడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఈనెల 19న మిక్చర్ పొట్లం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు

More News

'కేశవ' మే 19న గ్రాండ్ రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...

ఇక పై 'మా' తక్షణ సహాయం 2లక్షలు!

'మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘం)మెంబర్ల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.

ఈ నెలఖరున గోల చేస్తామంటున్న 'ప్రేమలీల..పెళ్లి గోల' టీమ్!

రెండు దశాబ్ధాలకు పైగా రాయలసీమలో నాలుగు వందలకు పైగా చిత్రాలను పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

జూన్ 2న రాజ్ తరుణ్ 'అంధగాడు'

మల్టీ టాలెంటెడ్,ఎనర్జిటిక్ యాక్టర్ రాజ్ తరుణ్ పుట్టినరోజు నేడే(మే 11).

తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల 'బాహుబలి-2' వివరాలివిగో....

తెలుగు సినిమాకు పరిమితులుంటాయనే ఆలోచనలను తిరగరాసిన సినిమా 'బాహుబలి-2'.