MLC Kavitha:తీవ్ర అస్వస్థతతో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

  • IndiaGlitz, [Saturday,November 18 2023]

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కుమార్ గెలుపు కోసం ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆమె బాగా నీరసించిపోయి, కళ్లు తిరిగి పడిపోయారు. తోటి కార్యకర్తలు వెంటనే ఆమెను చెట్టు కిందకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురై కవిత అస్వస్థతకు గురైనట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు.

మూడు రోజులుగా కవిత ఎన్నికల ప్రచారంంలో పాల్గొంటున్నారని.. గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్నందువల్లే ఆమె నీరసంతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ స్వతహాగా డాక్టర్ కావడంత ఆమెను పరిశీలించి ప్రాథమిక చికిత్స చేయడంతో కోలుకుని తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. కాగా తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈసారి హోరాహోరిగా సాగుతున్న సంగతి తెలిసిందే. నువ్వానేనా అనే రీతిలో అన్ని పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ కష్టపడుతున్నారు.

More News

Nani:రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని.. ఎందుకంటే..?

తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఏ గల్లీ చూసినా పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది.

Vijayashanthi:కాంగ్రెస్‌లో అలా చేరారో లేదో.. విజయశాంతికి కీలక బాధ్యతలు..

మాజీ ఎంపీ విజయశాంతి నిన్న(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదో ఇవాళ ఆమెకు కీలక పదవి అప్పగించారు.

Purandeswari:ఏపీలో జనసేన-బీజేపీ కలిపి పోటీ చేస్తాయి: పురదేంశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.

Vijayashanthi:కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు..

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు.

Tiger Nageswara Rao:ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

మాస్‌ మహారాజ రవితేజ తొలిసారి పాన్ ఇండియా హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది.