బుర్రలేని దర్శకులతో ఇకపై పనిచేయను: కీరవాణి
- IndiaGlitz, [Monday,March 27 2017]
రెండు వందల చిత్రాలకు పైగా సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మితభాషి. బాహుబలి తర్వాత తాను సినీ సంగీతం నుండి విరమణ తీసుకుంటానని ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 ప్రి రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముందు కీరవాణి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రస్తుతమున్న సంగీత దర్శకులపై చేసిన కామెంట్స్ సంచలనమైయ్యాయి. తాను సంగీత దర్శకుడుగా పనిచేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని అందుకు కారణం తెలివి తక్కువ దర్శకులేనని, వారితో తాను పనిచేయనని ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా..తన మనసులోని భావాలను ఆయన స్వేచ్చగా తెలియజేశారు. రాజమౌళికి వృత్తిపట్ల అంకితభావం ఎక్కువ, తన ప్రమాణాల్ని అందుకోవడం అంత సులభం కాదు.
ఇది వందశాతం నిజమని ఆయన చెప్పారు. రామోజీరావుగారు, కృష్ణంరాజు, బాలచందర్, మహేష్‌భట్‌కు తనకు ఎంతో సపోర్ట్ చేశారని వారికి కృతజ్ఞతలు. నేను ఇండస్ట్రీలో బుర్రలేని దర్శకులతో పనిచేశాను. తననెప్పుడూ సంగీత దర్శకుడుగానే భావించి మంచి సలహాను పక్కన పెట్టారని, అలాంటి బ్రెయిన్ లెస్ దర్శకులతో ఇకపై పనిచేయను.
క్షణ క్షణం వంటి సత్తా వున్న చిత్రాలకు మాత్రమే సంగీతాన్నందించాలని, తక్కువ స్థాయి నిర్మాణ సంస్థలతో వ్యవహారం మంచిది కాదని రామ్‌గోపాల్ వర్మ నాకు చెప్పారు. అప్పుడు నేను ఆయన మాటను పట్టించుకోలేదు. విచిత్రమేమిటంటే నాకు ఇచ్చిన సలహాను రామ్‌గోపాల్‌వర్మ కూడా పాటించలేదు. ఎన్నో అపజయాలు వున్నప్పటికీ నేటికీ రామ్‌గోపాల్‌వర్మ జీనియస్. ఒక వేళ సంగీత దర్శకుడుగా ఉంటే స్వర రచనలో దర్శకుడి అనవసర ప్రమేయాన్ని అంగీకరించను అంటూ నిర్మొహమాటంగా తన భావాలను చెప్పుకొచ్చారు.