జనాభా లెక్కలకోసం ఇక మొబైల్ యాప్!

  • IndiaGlitz, [Monday,September 23 2019]

అవును.. జనాభా లెక్కల కోసం ఇన్ని రోజులూ ఇంటింటికి వచ్చి లెక్కలేసుకుని మరీ రాసుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై ఇలాంటివన్నీ ఏమీ ఉండకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2021 నుంచి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

సోమవారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. 2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు ప్రకటించారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్‌కు ఇదొక పరివర్తన అని ఆయన చెప్పుకొచ్చారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు గత మార్చిలోనే కేంద్రం ప్రకటించిన విషయం విదితమే.

కాగా ఈ ప్రక్రియ హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభంకానున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే కేంద్రం చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

దర్శకరత్న 'దాసరి అవార్డ్స్' బ్రోచర్ విడుదల

రాక్ స్టార్ ఈవెంట్స్ మరియు కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డ్స్‌ను ప్రదానం చేయనున్నారు.

'రాయలసీమ లవ్ స్టోరీ' చిత్రం పక్కా మాస్ ఎంటర్ టైనర్

ఏ 1ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం 'రాయలసీమ లవ్ స్టోరీ'.

`RRR` వాయిదా ప‌డ‌నుందా?

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి `RRR`. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌,

కొండారెడ్డి బురుజు వ‌ద్ద మ‌రోసారి మ్యాజిక్

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై

'ఉల్లాలా ఉల్లాలా' తో తెలుగులోకి ఎంట‌ర‌వుతున్న‌`ల‌వ‌ర్స్ డే` ఫేమ్ నూరిన్‌

మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన `ఒరు ఆదార్ ల‌వ్‌` చిత్రం రిలీజ్‌కి ముందు ప్రియా వారియ‌ర్‌కి ఎంత పేరు తీసుకొచ్చిందో, రిలీజ్ త‌ర్వాత నూరిన్‌కి అంత పేరు తీసుకువచ్చింది.