చిరు, నాగ్‌ల‌కు మోదీ ప్ర‌శంస‌...

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంతా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. ఆలోపు ప్ర‌జ‌ల్లో క‌రోనా వైర‌స్ గురించి అవ‌గాహ‌న పెంచ‌డానికి సినీ ప్ర‌ముఖులంద‌రూ ముందుకు వ‌చ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్ర‌ముఖులు వీడియోల రూపంలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా కోటి సంగీతం అందించిన ఓ పాట‌లో చిరంజీవి, నాగార్జున‌, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌లు న‌టించారు. ఈ పాట‌కు మంచి స్పంద వ‌చ్చింది.

దీనిపై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న చిరంజీవి, నాగార్జున‌, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల‌ను అభినందించారు. ‘‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు.

థాంక్స్ చెప్పిన చిరు..

మోదీ ట్వీట్‌కు చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా థాంక్స్ చెప్పారు. క‌రోనా క్రైసిస్‌లో ప‌డ‌కుండా దేశాన్ని కాపాడుతున్నందుకు ఆయ‌న‌న‌కు అభినంద‌న‌లు చెప్పిన చిరు .. త‌మ‌కు వీలైనంత సాయాన్ని చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

More News

కార్తీకేయ 2 కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న నిఖిల్ సిద్ధార్థ్

యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2. వ‌రుస హిట్ సినిమాలు రూపొందిస్తున్న

సాంగ్‌తో షురూ చేయ‌నున్న ఆలియా భ‌ట్‌

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న

వ‌రుణ్‌తేజ్‌తో న‌టిస్తోన్న హీరోయిన్‌?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్

కీర్తి పెళ్లి చేసుకోనుందా..?

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది. త‌ర్వాత తెలుగు,

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుప‌మ‌

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌..అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ సరికొత్త అడుగు వేయనుందా? అంటే అవున‌నే స‌మాధానం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుండి విన‌ప‌డుతుంది.