close
Choose your channels

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రశంసలు..

Friday, May 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రశంసలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయం అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని లేఖలో మోదీ పేర్కన్నారు. పచ్చదనాన్ని పెంచటంతో పాటు, పరిశుభ్ర అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు సంతోష్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

భూమాతను, ప్రకృతిని పూజించటం ఆది నుంచీ మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమని, ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తోందన్నారు. మనమందరమూ భూమాత పిల్లలమేనని, ప్రకృతితో సహజీవనం, సమన్వయం జీవనమార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రకృతి పరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సహం, కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ రక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు.

ఇదీ చదవండి: ఉల్లిపాయ, ఫ్రిడ్జ్ బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతాయా?

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి సైతం ప్రధాని తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనటం ద్వారా పచ్చదనాన్ని దేశ వ్యాప్తంగా పెంచాలని ప్రధాని ఆకాంక్షించారు. తద్వారా ఈ కార్యక్రమం మరింత వేగాన్ని, విస్తృతిని అందుకోవాలన్నారు. లేఖ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అభినందించిన ప్రధాన మంత్రికి ఎం.పీ సంతోష్ కుమార్ సైతం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ముందకు తీసుకువెళ్తామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.