అక్కడ అడుగు పెట్టిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్..

ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఆయన గుజరాత్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అలాగే ప్రధానమంత్రి అయ్యే వరకూ పార్లమెంటులో అడుగు పెట్టలేదు. రామ మందిర నిర్మాణం మొదలయ్యే దాక అయోధ్యలోనూ దాదాపు 30 ఏళ్ల నుంచి అడుగు పెట్టలేదు. ఇంతేకాదు నేడు ఆయన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

అయోధ్యలోని రామ జన్మభూమి (రామ్‌లల్లా)లో అడుగుపెట్టిన తొలి ప్రధానిగా మోదీ రికార్డ్ సాధించారు. అంతకు ముందు ఎందరో ప్రధానులు అయోధ్యకు వెళ్లినప్పటికీ రామ్‌లల్లాను మాత్రం ఎవరూ సందర్శించలేదు. భూమిపూజ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో రామ్‌లల్లాను నేడు సందర్శించారు. 1966లో ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో అయోధ్యకు వెళ్లి సరయూ నదిపై వంతెన నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1975లో నరేంద్ర దేవ్ వ్యవసాయ యూనివర్సిటీకి.. మరో సందర్భంలో 1979లో అయోధ్యకు వెళ్లిన ఇందిర హనుమాన్ గఢీ ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు తప్ప రామ్‌లల్లాను సందర్శించలేదు.

ఇందిర తనయుడు రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా 1986లో బాబ్రీ మసీద్ తెరిచి శిలాన్యాసం చేశారు. ఆ తరువాత 1984, 1989లలో అయోధ్యలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తప్ప రామ్‌లల్లాను దర్శించుకోలేదు. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పాయ్ కూడా 2003లో అయోధ్యకు రామచంద్ర దాస్ పరమహంస్ మృతి చెందిన సమయంలోనూ అంతకు ముందు పలు మార్లు వెళ్లారు. కానీ ఒక్కసారి కూడా రామ్‌లల్లాను సందర్శించలేదు. ఆ ఘనత ఒక్క మోదీకే దక్కింది.

More News

ఆ ప‌నిచేయ‌డానికి రెండు వారాలు గ్యాప్ తీసుకున్నా:  నందితా శ్వేత‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి సినిమాల్లో దెయ్యం పాత్ర‌ల‌తో

నితిన్‌కు నో చెప్పిన పూజా హెగ్డే..?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు.

ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

వినాయకచవితి వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపూ ఖైరతాబాద్ వినాయకుని వైపే ఉంటుంది.

అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసిన మోదీ..

యావత్ భారతావనికి ఉత్కంఠ భరితమైన క్షణాలివి.. శ్రీరామ నామ జపంతో దేశ మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.