'మామ మంచు.. అల్లుడు కంచు'

  • IndiaGlitz, [Wednesday,July 15 2015]

డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం 'అల్లరి మొగుడు'. వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్ ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వాటిలో 'అల్లరి మొగుడు'కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్ జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తు చేయడానికి కారణం ఉంది.

మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది. 23 ఏళ్ల తర్వాత ఈ త్రయం మళ్లీ మేజిక్ చేయబోతున్నారు. ఈసారి ఈ కాంబినేషన్ కి 'అల్లరి' నరేశ్ తోడయ్యారు. నరేశ్ సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. సినిమా పేరు 'మామ మంచు... అల్లుడు కంచు'. టైటిల్ రోల్స్ లో మోహన్ బాబు, 'అల్లరి' నరేశ్ నటించనున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుసగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత. ఈ మధ్యకాలంలో సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలు చేసిన మోహన్ బాబు ఫుల్ ప్లెడ్లెడ్జ్ హీరోగా చేయబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది.

అలీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణభగవాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సిపాన, కెమెరాః బాల మురుగన్, ఆర్ట్ః చిన్నా, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి, నిర్మాత: మంచు విష్ణు.

More News

ఆ హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయింది..

భీమిలి కబడీ జట్టు, వైశాలి, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ హీరోయిన్ శరణ్య మోహన్ మన పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది.

యంగ్ టైగర్ రోల్ అదేనా..?

‘టెంపర్’ వంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట

గోదావరి పుష్కారాలు ఈరోజు ప్రారంభమైయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమౌళికి శంకర్ ప్రశంస

బాహుబలి వంటి విజువల్ వండర్ తో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ప్రేక్షకుల నుండే కాకుండా సినీ వర్గాల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.