శ్రీవిద్యానికేతన్‌కు యూనివర్సిటీ హోదా: ‘‘ చిన్న మొలకలు... కల్ప వృక్షంగా’’ మారాయంటూ మోహన్ బాబు ట్వీట్

  • IndiaGlitz, [Thursday,January 13 2022]

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. వెండితెరపై రాణిస్తున్న సమయంలోనే పేదా, ధనిక, కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తున్నారు మోహన్ బాబు. ‘‘శ్రీవిద్యానికేతన్’’ పేరిట విద్యాసంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా 25 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి విద్యను అందిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న లక్షలాది మంది విద్యార్ధులు దేశ , విదేశాల్లో కీలక స్థానాల్లో వున్నారు. వీరిలో సినీనటుడు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు ఇలా ఎన్నో రంగాలకు చెందిన వారున్నారు.

ఈ క్రమంలో శ్రీవిద్యానికేతన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మోహన్ బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ కాలేజీకి యూనివర్సిటీ హోదా దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా పెదరాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు

” చిన్న మొలకలుగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం .. విద్యాసంస్థలను ఇప్పుడు యూనివర్సిటీ స్ధాయికి చేర్చాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని ఇప్పటినుంచి మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం.. మీ సహకారం ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

1993లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థను ప్రారంభించారు మోహన్ బాబు. ఆ తర్వాత విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ నెలకొల్పారు. అన్ని విద్యా సంస్థలు ఒకేచోట ఉండటంతో చాలా రోజులుగా యూనివర్సిటీ హోదా కోసం ప్రయత్నిస్తున్నారు మోహన్ బాబు. ఈ యత్నాలు ఫలించి ఆయన కోరిక నెరవేరింది.

More News

బ్యాడ్మింటన్ లీగ్‌లో కోవిడ్ కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిపుణులు చెప్పినదాని కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా మాకేం బాధలేదు.. కానీ : రామ్‌చరణ్ హాట్ కామెంట్స్

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.

అల వైకుంఠపురానికి రెండేళ్లు : ఒక్క హిట్టు.. ‘‘పూజా’’ని స్టార్ హీరోయిన్‌ని చేసింది

కొన్ని సినిమాలు కొందరి కోసమే పుడతాయి. అవి కూడా చరిత్రను తిరగరాసేవిగానో, ఎదుగుబొదుగు లేని జీవితానికి మంచి బూస్ట్ ఇచ్చేలాంటివో అవుతాయి.

మహమ్మారి కమ్ముకొస్తుంటే.. కొవిడ్‌ నిబంధనలు గాలికి, 1500 మంది కలిసి కోతి అంత్యక్రియలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విశ్వరూపం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ భారీ స్థాయిలో కేసులతో యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాలు వణికిపోతున్నాయి.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం, మృతులు వైసీపీ ఎమ్మెల్యే బంధువులు

గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తల్లికూతుళ్లు కాలువలో గల్లంతయ్యారు. వీరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడి భార్యాపిల్లలు.