close
Choose your channels

మరోసారి విల‌న్‌గా క‌లెక్ష‌న్ కింగ్‌...?

Tuesday, August 28, 2018 • తెలుగు Comments

మరోసారి విల‌న్‌గా క‌లెక్ష‌న్ కింగ్‌...?

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా,  హీరోగా, నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు. ఈ మ‌ధ్య ఆయ‌న ఎక్కువ‌గా త‌న విద్యాసంస్థ‌ల ప‌నుల‌తోనే బిజీగా ఉన్నారు. న‌ట‌న‌కు దూరంగానే ఉంటున్నారు.

ఆయ‌న న‌టించిన గ‌త చిత్రం గాయ‌త్రిలో ఆయ‌న హీరోగా.. విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌ని ఆయ‌న మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. అది కూడా త‌మిళంలో.. అది కూడా విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు.

ఇన్నేళ్ల కెరీర్‌లో త‌మిళంలో ఓ సినిమా కూడా న‌టించ‌ని మోహ‌న్‌బాబు తొలిసారి త‌మిళ సినిమా చేయ‌నుంటం గ‌మ‌నార్హం. హీరో సూర్య, సుధా కొంగ‌ర కాంబినేష‌న్‌లో న‌వంబ‌ర్ నుండి ఓ సినిమా స్టార్ట్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను త‌న స్వంత బ్యాన‌ర్‌లో సూర్య తెలుగు, త‌మిళంలో నిర్మించ‌బోతున్నారట‌.