ఆవేశపరుడినే అవినీతిపరుడు కాదంటున్నమోహన్ బాబు..

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్ బాబు త్వ‌ర‌లో రాజకీయాల్లోకి ప్ర‌వేశించ‌నున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మోహ‌న్ బాబు మీడియాకి తెలియ‌చేసారు. తిరుప‌తిలోని విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల్లో మోహ‌న్ బాబు మీడియాతో మాట్లాడుతూ...పేద ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని పేప‌ర్లో చూసి ప్ర‌తిరోజు బాధ‌ప‌డుతుంటాను.
మ‌న‌కెందుకు అని ఊరుకోవ‌డం క‌రెక్ట్ కాదు. అందుక‌నే మోహ‌న్ బాబు అంటే ఏమిటో తెలియ‌చేయ‌డానికి త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాను అన్నారు. తాను ఆవేశ‌ప‌రుడినే త‌ప్ప అవినీతిప‌రుడు కాద‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో రాజకీయాల్లో జంపింగ్ లు ఎక్కువ‌య్యాయి. పార్టీలు మార‌డం అంటే ఎంగిలి మెతుకులు తిన‌డంతో స‌మానం. నాయ‌కుడిని న‌మ్మి వెళితే ఐదేళ్ల పాటు ఆయ‌న వెన‌క ఉండాలి. నాయ‌కుడి తీరు న‌చ్చ‌క‌పోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలే త‌ప్ప పార్టీ మార‌కూడ‌దు అన్నారు. తాను ఏ పార్టీలో చేర‌బోతున్నాన‌నేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తా అన్నారు.

More News

నిజంగా అదృష్టంగా భావిస్తున్నా - దేవిశ్రీప్ర‌సాద్

త‌న‌దైన శైలిలో సంగీతం అందిస్తూ..త‌న‌కంటూ ఓ క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్. ఇంత‌కీ...దేవిశ్రీ అదృష్టంగా భావిస్తున్నా అని ఎందుకు అన్నార‌ని ఆలోచిస్తున్నారా..? మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది.

టాప్ టెన్ లో ఊపిరి...

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ -మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఊపిరి.

సమంతకి రిపీట్ అవుతుందా?

ప్రతి ఒక్క నటుడికి లేదా నటికి కొన్ని లైఫ్ చేంజ్ మూవీస్ ఉంటాయి.సమంతకి కూడా అలాంటి సినిమాలు రెండు ఉన్నాయి. అవే 'ఏమాయ చేసావె','మనం'.

'జక్కన్న' కి సునీల్ సెంటిమెంట్

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న కథానాయకులలో సునీల్ ఒకరు.

'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా

జయాపజయాల సంగతి పక్కన పెడితే..కొందరు దర్శకులు తమ ప్రతిభతో ఇట్టే ఆకట్టుకుంటారు.అలాంటి వారిలో యువ దర్శకుడు పరుశురామ్ ఒకరు.