ఫిబ్రవరి 9న విడుదల కానున్న మోహన్ బాబు 'గాయత్రి'

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న 'గాయత్రి' చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ నేటితో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.

నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, నిర్మాతలు ఫిబ్రవరి 9, 2018 ను విడుదల తేదీగా ఖరారు చేసారు. ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.