close
Choose your channels

అసలు పేరుతో.. పవర్ ఫుల్ లుక్‌లో కలెక్షన్ కింగ్

Friday, February 28, 2020 • తెలుగు Comments

అసలు పేరుతో.. పవర్ ఫుల్ లుక్‌లో కలెక్షన్ కింగ్

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య హీరోగా గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫైనల్‌లో ఉంది. ఎయిర్ ద‌క్కన్ వ్యవ‌స్థాప‌కుడు ఆర్‌.గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. మోహన్ బాబుకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం పంచుకోగా.. దాన్ని కలెక్షన్ కింగ్ తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

కాగా.. భారత వాయుసేనకు చెందిన అధికారిగా మోహన్ బాబు ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.  సూర్యకు మెంటర్ అనగా మార్గద‌ర్శి పాత్రలో మోహ‌న్‌బాబు క‌నిపించబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ పేరు భ‌క్తవ‌త్సలం నాయుడు.. అంటే ఆయన ఒరిజనల్ పేరు అన్న మాట. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కొన్నిరోజుల క్రితమే సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్‌ను ఎయిర్‌పోర్టులో వినూత్నంగా చిత్రబృందం చేపట్టింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏప్రిల్ నెల‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా డ‌బ్బింగ్ కార్యక్రమాల‌ను కూడా మోహ‌న్‌బాబు పూర్తి చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz