బావా బాహుబలి పెళ్ళి చేసుకో అంటూ మోహన్ బాబు ట్వీట్....

  • IndiaGlitz, [Wednesday,May 03 2017]

విల‌క్ష‌ణ న‌టుడు క‌లెక్ష‌న్ కింగ్ ఎం.మోహ‌న్‌బాబు, బాహుబ‌లి స‌క్సెస్ ప‌ట్ల టీంకు అభినంద‌న‌లు తెలియ‌జేశాడు.

ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో 'విశ్వ విజయేంద్ర ప్రసాద్' గా సార్థక నామధేయుడివి అయ్యావ్ ... ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను.

ప్రియమైన ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి భారతదేశంలో తెలుగు ప్రజలున్నారని అన్నయ్య NT రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప తెలుగు దర్శకుడున్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావ్. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి 'రమ' ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను...

బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే 'రాజులు' పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ..

కీర్.. మరకతమణిగా.. MM క్రీమ్ గా.. కీరవాణిగా.. ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడవై పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ...

ప్రియమైన రాణా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు.. దిగ్విజయోస్తు..

నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకోర్చి మీరు బాహుబలి ద్వారా ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్నందుకు నాతోపాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. డియర్ శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని అంటూ యూనిట్‌లోని ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించాడు మోహ‌న్‌బాబు..

More News

'ఖయ్యుంభాయ్' గుమ్మడికాయ వేడుక !

గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జూన్ లో వీడెవడు?

సచిన్ హీరోగా భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా ఫేమ్తాతినేని సత్య దర్శకత్వంలో వై కింగ్ మీడియా అండ్ఎంటర్ టైన్మెంట్ సంస్థపై రైనా జోషి నిర్మించిన యాక్షన్థ్రిల్లర్ ‘వీడెవడు’.

మైత్రీ మూవీస్ లో చైతు...

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై రారండోయ్ వేడుకచూద్దాం, కృష్ణ అనే నూతన దర్శకుడితో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వినపడ్డ సంగతి తెలిసిందే.

కాజల్ క్లారిఫికేషన్....

బాలీవుడ్ నటి కాజల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. స్టార్ హీరో అజయ్దేవగన్ ను పెళ్ళి చేసుకున్న కాజల్ ఇప్పుడు తమిళ సినిమా విఐపి 2 చిత్రంలో నటిస్తుంది.

500 కోట్ల 'బాహుబలి-2'

తెలుగు సినిమా అంటే సరికొత్త అర్థం చెబుతూ బాహుబలి రెండో పార్ట్ 'బాహుబలి -2' బాక్సాఫీస్ వద్ద స్టామినాను చాటుతుంది. కొత్త కొత్త రికార్డులను తెర తీస్తుంది.