స్పోర్టివ్‌గా తీసుకున్న మోహ‌న్‌బాబు...

  • IndiaGlitz, [Wednesday,September 05 2018]

రీసెంట్‌గా రాజ్‌దీప్ స‌ర్దేశాయి అనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ... మోహ‌న్‌బాబును ఇంట‌ర్వ్యూ చేశారు. అందులో మోహ‌న్‌బాబు ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఎ సినిమాలోని ఓ స‌న్నివేశం గురించి వివ‌రిస్తూ ఫ‌స‌క్ అనే ప‌దాన్ని ఉప‌యోగించారు. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. చాలా స్పూఫ్ వీడియోలు సంద‌డి చేస్తున్నాయి.

ఈ విష‌యం మోహ‌న్‌బాబు వ‌ర‌కు చేరింది. అయితే ఆయ‌న దీన్ని స్పోర్టివ్‌గానే తీసుకున్నారు. సోష‌ల్ మీడియా భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో దీనిపై స్పందిస్తూ... 'ఫ‌సక్ అనే పదం ట్రెండింగ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. దీనిపై దాదాపు 200 స్పూఫ్ వీడియోలున్నాయ‌ని విష్ణు చెప్పాడు. కొన్నింటిని చూశాను. ఇన్నోవేటివ్‌గా, ఫ‌న్నీగా ఉన్నాయి' అన్నారు.