close
Choose your channels

మీ స్పందనకు ధన్యవాదాలు ‘సూర్య’ మిత్రమా!

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రియాక్ట్ అయినందుకు ధన్యవాదాలు ‘సూర్య’ మిత్రమా..!

తమిళ స్టారో హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూరారై పొట్రు’ చిత్రం. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్, దిగ్గజ నటుడు మంచు మోహన్‌ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా తాజాగా మోహన్‌ బాబు జాయిన్‌ అయ్యారు. బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘ఎయిర్ డెక్కన్’ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఛండీగఢ్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సందర్భంగా సూర్య గురించి ట్విట్టర్ వేదికగా మంచు మోహన్ బాబు ఆసక్తికర పోస్ట్ చేశారు.

మిత్రమా ధన్యవాదాలు!

"ఇంత గొప్పగా చెప్పినందుకు థ్యాంక్యూ సూర్య. ఈ తరం టాప్ స్టార్లలో మీరు ఒకరైనప్పటికీ సెట్స్‌లో మీ క్రమశిక్షణ, విధేయత మీ గొప్ప క్యారెక్టర్‌ గురించి చెబుతాయి. తరవాత షెడ్యూల్ గురించి వేచి చూస్తున్నాను.. మై యంగ్ ఫ్రెండ్" అంటూ ట్వీట్‌ చేశారు.

సూర్య ఏం ట్వీట్ చేశారు!?

"సెట్స్‌లో మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషం ఉంది. గొప్ప క్రమశిక్షణ కలిగిన దిగ్గజం మోహన్‌బాబు గారితో సెట్స్‌లో గడపడం ఎంతో అదృష్టం. ఒక గ్యారేజ్‌లో మొదలై 500 పైగా సినిమాల వరకు వెళ్లిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇదో అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ‘సూరరాయి పోట్రు’లో భాగమైనందుకు మీకు కృతజ్ఞతలు సార్" అని సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మోహన్ బాబు పాత్రేంటి..!?

ఇదిలా ఉంటే.. మోహన్‌బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కాగా.. ‘మహానటి’లో ఎస్వీ రంగారావుగా కనిపించి మెప్పించన మోహన్‌బాబు ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. దీంతో ఇప్పుడు సూర్యతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.