close
Choose your channels

అఖిల్ సినిమాలో మోహన్‌లాల్‌.. హాలీవుడ్ స్ఫూర్తితో..?

Tuesday, March 16, 2021 • తెలుగు Comments

అఖిల్ సినిమాలో మోహన్‌లాల్‌.. హాలీవుడ్ స్ఫూర్తితో..?

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రం క‌థ‌ను రైట‌ర్ వ‌క్కంతం వంశీ హాలీవుడ్ మూవీ సిరీస్ ది బ‌ర్న్ స్ఫూర్తితో త‌యారు చేశాడ‌ట‌. ఇదొక స్పై థ్రిల‌ర్ అని టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్‌.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. అలాగే ఇది వ‌ర‌కే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముంబై మోడ‌ల్ సాక్షి వైద్య‌ను తీసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో ఈసినిమాను తెర‌కెక్కించాలని డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి భావిస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు మినిమం స‌క్సెస్ కూడా చూడ‌ని అఖిల్‌పై న‌ల‌బై ఐదు కోట్ల రూపాయ‌ల‌కు పైగానే బ‌డ్జెట్‌ను పెట్టి సినిమా చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. మరో వైపు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విడుదలకు సిద్ధమవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా సినిమాను నిర్మిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz