'సిద్ధార్ధ' టీమ్ ను విష్ చేసిన మోహన్ లాల్

  • IndiaGlitz, [Monday,September 12 2016]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌కు, తెలుగు సినిమాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన రెండు తెలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి 'మ‌న‌మంతా'. రెండోది 'జ‌న‌తా గ్యారేజ్‌'. ఈ నేప‌థ్యంలో మోహ‌న్‌లాల్ మ‌రో తెలుగు సినిమా గురించి ప్ర‌స్తావించారు. అయితే ఈ సారి ఆయ‌న ప్ర‌స్తావించిన చిత్రంలో ఆయ‌న న‌టించ‌లేదు. అయినా ఆ సినిమా గురించి, అందులోని నాయిక‌ను ఉద్దేశించి ప్ర‌స్తావించ‌డం విశేషం. మోహ‌న్‌లాల్ ప్ర‌స్తావించిన ఆ సినిమా పేరు 'సిద్ధార్థ‌'. సాగ‌ర్‌ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న సాగ‌ర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు.

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ''మా సినిమా టీమ్‌ను, మా చిత్ర క‌థానాయిక రాగిణిని విష్ చేస్తూ మ‌ల‌యాళం సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ 'ఆల్ ది బెస్ట్ రాగిణి ఫ‌ర్ యువ‌ర్ న్యూ తెలుగు మూవీ సిద్ధార్థ' అని ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన‌డం ఆనందంగా ఉంది.

మా 'సిద్ధార్థ‌'కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు. .

ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత - దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.

More News

చిరు మూవీ సీక్వెల్ లో చ‌ర‌ణ్..!

మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక‌సుంద‌రి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యానర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఇప్పుడు అశ్వ‌నీద‌త్ ఈ చిత్రానికి సీక్వెల్ తీయాల‌నుకుంటున్నారు.

70 కోట్ల క్ల‌బ్ లో జ‌న‌తా గ్యారేజ్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఈనెల 1న రిలీజై రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

అభినేత్రి ట్రైల‌ర్ రిలీజ్..!

త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవా నిర్మిస్తుంటే, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు.

హ్యాపీ బ‌ర్త్ డే టు అమ‌ల అక్కినేని..!

క్లాసిక్ డాన్స‌ర్ గా..క‌ధానాయిక‌గా...బాధ్య‌త గ‌ల ఇల్లాలిగా..మాతృమూర్తిగా..బ్రూ క్రాస్ సొసైటీ ఫౌండ‌ర్ గా....ఇలా ప్ర‌తి ద‌శ‌లోను ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్న గొప్ప మాన‌వ‌తామూర్తి  శ్రీమ‌తి అమ‌ల అక్కినేని. సెప్టెంబ‌ర్ 12 అమ‌ల పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా  అక్కినేని అమ‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం...

రెండు సీన్స్ యాడ్ అయ్యాయి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మోహ‌న్ లాల్, స‌మంత‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు న‌టించిన చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మింప‌బ‌డిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటూ ముందుకు వెళుతుంది.