close
Choose your channels

తొలిసారిగా.. అభిని నామినేట్ చేసిన మోనాల్, హారిక..

Tuesday, December 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తొలిసారిగా.. అభిని నామినేట్ చేసిన మోనాల్, హారిక..

నిన్న హోస్ట్ నాగ్ ముందు చేసిన కాన్వర్సేషన్‌ని తరువాత కూడా అవినాష్ కంటిన్యూ చేశాడు. నేను చాలా వీక్ అందుకే కంటెస్టెంట్లు నాకు ఓటు వేయలేదనేది అవినాష్ వాదన. సొహైల్, అఖిల్ సర్ది చెప్పేందుకు యత్నించినా వినలేదు. ఇక నెక్ట్స్ డే ‘యమ డార్లింగ్.. యమ డార్లింగ్ బేబీ’ సాంగ్‌తో స్టార్ట్ అయింది. అరియానా.. సొహైల్‌ని హగ్ చేసుకుని నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమని చెప్పింది. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. అఖిల్, సొహైల్, అవినాష్ పడుకున్నారు. బిగ్‌బాస్ ఆ ముగ్గురి పేర్లనూ పిలిచి.. మీ నిద్ర పూర్తైతే వచ్చి మీ పేరున్న టేబుల్ ముందు నిలబడమని చెప్పడం ఫన్నీగా అనిపించింది. ఇక ఎలిమినేషన్ టాస్క్ ప్రారంభమైంది. బిగ్‌బాస్ ఎవరి పేర్లను పిలిస్తే వాళ్లు వెళ్లి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కంటైనర్స్‌లో రీజన్ చెప్పి కలర్ వాటర్ పోయాలి. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఎవరి కంటైనర్‌లో ఎక్కువ కలర్ వాటర్ ఉంటే వారు ఎలిమినేట్ అయినట్టు. మొదట హారిక వెళ్లి.. అవినాష్‌ని నామినేట్ చేసింది. మరో కంటెస్టెంట్ అభిని నామినేట్ చేసింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని వ్యాల్యూ ఇచ్చినట్టు అనిపించలేదనిపించిందని హారిక కారణం చెప్పింది. అభి పేరు చెప్పగానే షాక్ అయినట్టు చెప్పింది. టాస్క్‌ని టాస్క్‌లా చూడాల్సిందేమో అనిపించిందని అభికి హారిక రీజన్ చెప్పింది. నామినేట్ చేసిన తర్వాత హారిక బాగా హర్ట్ అయింది.

అవినాష్.. మోనాల్‌ను నామినేట్ చేశాడు. లాస్ట్ టైమ్ నామినేషన్స్‌లో తను స్ట్రాంగ్ అనడానికి.. మోనాల్ వీక్ అనడానికి పర్‌ఫెక్ట్ రీజన్ చెప్పానని అయినా సరిగా రీజన్ చెప్పకుండా స్వాప్ చేయలేదని నామినేట్ చేశాడు. అలాగే తెలుగు నేర్చుకుని మాత్రమే ఇక్కడి వరకూ వచ్చావని.. నువ్వు వీక్ అని ఒకరకంగా అవమానకరంగా అవినాష్ మాట్లాడాడు. నెక్ట్స్ అఖిల్‌కి నువ్వు నన్ను వరస్ట్ కెప్టెన్ అన్నావని నామినేట్ చేశాడు. రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. దీనిపైనే అఖిల్ కూడా వాదించాడు. నెక్ట్స్ అఖిల్ వచ్చి అవినాష్‌ని నామినేట్ చేశాడు. నాకన్నా వీక్ ఉన్నారు అంటున్నావు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? అని అఖిల్ రీజన్ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. తరువాత మోనాల్‌ను గేమ్ పరంగా ఆలోచించాను ఎఫర్ట్ చాలా తక్కువ అనిపించిందని మోనాల్‌ను నామినేట్ చేశాడు.  తరువాత అభి వచ్చి మోనాల్‌ను నామినేట్ చేశాడు. నీతో డే వన్ నుంచి పర్సనల్‌గా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. తరువాత అఖిల్‌‌కి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నేను నిన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. హారికకు నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంక ఎవరూ నన్ను అర్థం చేసుకోలేరని చెప్పి హారికను నామినేట్ చేశాడు. తరువాత వచ్చిన మోనాల్.. అవినాష్‌ను నామినేట్ చేసింది. నువ్వు నన్ను చాలా సార్లు వీక్ అని చెబుతున్నావని.. తెలుగు నేర్చుకుని మాత్రమే నేనిక్కడి వరకూ రాలేదని చెప్పింది. ఆడి మాత్రమే వచ్చానని.. నన్ను ఇంకెప్పుడూ వీక్ అనొద్దని అవినాష్‌కి చెప్పింది. ఈ నేపథ్యంలో అవినాష్, మోనాల్ మధ్య చిన్నపాటి మాటల వార్ జరిగింది. తరువాత అభిని మోనాల్‌ నామినేట్ చేసింది. మోనాల్ బిజినెస్ వద్దన్నాక నేను కూడా నీతో డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నానని మోనాల్ చెప్పింది. తరువాత అఖిల్‌ని కూడా మోనాల్ నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో అఖిల్, మోనాల్‌ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.

తొలిసారిగా.. అభిని నామినేట్ చేసిన మోనాల్, హారిక..

తరువాత మోనాల్ బాగా ఎమోషనల్ అయింది. నేను నా ఫ్యామిలీ కోసం వచ్చాను ఎవ్వరి కోసం రాలేదని హారికకు చెప్పింది. అఖిల్ గురించి హారికకు చెప్పి బాగా హర్ట్ అయింది. నువ్వు నామినేట్ చేస్తే నేను నవ్వుతూ తీసుకోవాలి.. నేను నిన్ను నామినేట్ చేస్తే నన్ను బ్లేమ్ చేస్తాడని హారిక ఫీల్ అయింది. నాలుగు వారాలుగా అవినాష్ నన్ను నామినేట్ చేస్తూనే ఉన్నాడు. నేను పులిహోర చేయలేదని నామినేట్ చేశాడని చెప్పింది. ఇక అఖిల్.. నన్ను బ్రెయిన్ పెట్టి ఆడతావన్నది.. ఇక అయిపోయిందని సొహైల్ దగ్గర చెప్పాడు. ఇక వీళ్లిద్దరూ ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారో చూడాలి. ఇక అరియానా.. హారికను నామినేట్ చేసింది. తరువాత మోనాల్‌ను నామినేట్ చేసింది. ఇక అరియానా మోనాల్‌తో ఏకంగా యుద్ధానికే దిగింది. నన్ను వరస్ట్ కెప్టెన్ అని ఎలా అంటావు.. అని వరుస బెట్టి అడుగుతూ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. అవినాష్ మధ్యలో ఎంటరై తెలుగులో మాట్లాడు అనడంతో మోనాల్ బాగా సీరియస్ అయ్యింది. గట్టిగా అరిచి మరీ మధ్యలో మాట్లాడకు అని చెప్పింది. తరువాత వెళ్లి సొహైల్‌ని అరియానా నామినేట్ చేసింది. అరియానా రీజన్ చెబుతుంటే సొహైల్ తక్కువ రంగు నీళ్లు పోయమంటూ కామెడీ చేశాడు. తరువాత సొహైల్ వెళ్లి అవినాష్‌ని నామినేట్ చేశాడు. తరువాత వెళ్లి అరియానాను నామినేట్ చేశాడు. నామినేషన్స్ కూడా ఇంత ఫన్నీగా చేస్తారా? అనిపించింది.. సొహైల్ నామినేట్ చేస్తుంటే.. తరువాత మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంటుంటే సొహైల్ వెళ్లి ఓదార్చాడు. హారిక, అఖిల్ మధ్య టై అవడంతో వారిద్దరినీ కూడా బిగ్‌బాస్ నామినేట్ చేశారు. ఫైనల్‌గా అవినాష్, మోనాల్, అభి, హారిక, అఖిల్ నామినేట్ అయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.