హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో నగరవాసుల్లో భయం, ఆందోళన ఎక్కువైంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ లిమిట్స్‌లో ఇప్పటి వరకు 399 కేసులు నమోదవ్వడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 08 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనర్ లిమిట్స్‌లో 51 మంది మాత్రమే కోలుకున్నారు. కరోనా మరణాల్లో 20 మంది హైదరాబాద్ లిమిట్స్‌వారే కావడం షాకింగ్‌కి గురి చేస్తోంది.

జోన్‌ల వారిగా పరిస్థితి ఇదీ..

తాజాగా.. హైదరాబాద్ పోలీస్ లిమిట్స్‌లో జోన్లు వారిగా కరోనా కేసుల లిస్ట్‌ను నగర సీపీ అంజనీకుమార్ జాబితాను విడుదల చేసింది. వెస్ట్, సౌత్ జోన్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నదని జాబితాను బట్టి తెలుస్తోంది. వెస్ట్ జోన్-138, సౌత్ జోన్-170 కేసులు, సెంట్రల్ జోన్-45, ఈస్ట్ జోన్-33 కేసులు కేసులు నమోదయ్యాయి. నార్త్ జోన్‌లో కరోనా ఇప్పటి వరకూ 13 కేసులతో తక్కువ తీవ్రతే ఉంది. కాగా.. నగరంలో ఎక్కువగా కేసులు ఉండటంతో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 873. ఇప్పటివరకూ రాష్ట్రంలో 21 మంది మరణించారు.

More News

కలకలం.. ప్రముఖ టీవీ ఛానెల్‌లో 26 మందికి కరోనా

కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మీడియా మిత్రులను కూడా కరోనా కాటేస్తోంది. ఇప్పటికే ముంబైలోని 56 మంది జర్నలిస్టులకు కరోనా

ఏపీలో 757కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇవాళ ఇద్దరు మృతి చెందారు.

ప్రమాణానికి సిద్ధమైన విజయసాయి.. కన్నా వాట్ నెక్స్ట్!?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్ల రూపాయిలకు అమ్ముడుపోయాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిస్థితి విషమం.. రంగంలోకి అమెరికా!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తున్న వేళ ఈ వార్త బయటికి రావడంతో పెను సంచలనమైంది.

చిరంజీవికి జోడి ఉంటుందా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ